Site icon Prime9

Twitter competitor: ట్విటర్ కు పోటీగా.. మరో యాప్ ను తీసుకురానున్న మెటా

Twitter competitor

Twitter competitor

Twitter competitor: ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ట్విటర్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై ఈ కొత్త యాప్‌ రానున్నటు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి మెటా టెస్టింగ్‌ కూడా నిర్వహిస్తోందని సమాచారం. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సైతం బయటకొచ్చాయి. అయితే మెటా తీసుకొచ్చే కొత్త యాప్ కు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. కానీ, పీ92, బార్సిలోనా వంటి పేర్లతో ఇంటర్నల్‌గా పిలుచుకుంటున్నట్టు స్క్రీన్ షాట్ల ద్వారా తెలుస్తోంది. ఇది సపరేట్ గా మరో యాప్‌గానే ఉండనుందని.. అయితే, ఇన్‌స్టా యూజర్లు తమ అకౌంట్‌తో కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పించేలా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జూన్‌లో కొత్త యాప్ ను అందుబాటులోకి వచ్చే అవకాశం

ఉందని సమాచారం.

 

టెక్ట్స్‌ రూపంలో టైమ్‌లైన్‌ పోస్టులు (Twitter competitor)

దాదాపు ఇన్ స్టా గ్రామ్ మాదిరి లానే ఈ కొత్త యాప్ ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే, వీడియోలు, ఫొటోల ఫీడ్‌ కాకుండా టెక్ట్స్‌ రూపంలో టైమ్‌లైన్‌ పోస్టులు కనిపించనున్నాయి. దీంతో కొత్త యాప్.. ట్విటర్‌ను పోలి ఉండబోతోందన్నమాట. 500 అక్షరాల వరకు టెక్ట్స్‌ రాసుకోవడంతో పాటు ఫొటోలు, వీడియోలు కూడా యాడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారిని.. ఒక్క క్లిక్‌తో కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యే విధంగా డిజైన్ చేయనున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారీగా యూజర్ల బేస్‌ను సంపాదించుకున్న మెటా.. ఇపుడు మరో కొత్త యాప్‌తో ఎంతవరకు దగ్గరవుతుందో వేచి చూడాలి. కాగా, ట్విటర్‌కు పోటీగా ఇది వరకే మాస్టోడాన్‌, ట్విటర్‌ మాజీ బాస్‌ జాక్‌ డోర్సీ బ్లూ స్కై వచ్చిన విషయం తెలిసిందే.

 

Exit mobile version