Social Media Influencers: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తూ, వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా ఫాలోవర్లను పెంచుకుంటారు కొందరు.
వారినే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు (social media influencers) అంటారు. కొన్ని రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేసి భారీగానే సంపాదిస్తుంటారు . ఇప్పుడు అలాంటి వారిపైనే ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం(Central govt).
సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లు గా ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ను ప్రవేశ పెట్టింది.
ఈ రూల్స్ లో భాగంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు (social media influencers) అందరూ తమకు చెందిన ఎండార్సర్ల వివరాలను వెల్లడించాలి.
హోటల్ అకామిడేషన్, ఈక్విటీ, డిస్కౌంట్లు, గిఫ్ట్స్ , అవార్డులు, రివార్డులు .. ఇలా ఏవి వచ్చినా వాటి వివరాలను ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుంది.
ఈ మేరకు కొత్తగా రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో తెలిపింది. ఒక వేళ ఎవరైనా ఆ వివరాలు ఇవ్వకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
అవసరమైన ఆ వాణిజ్య ఒప్పందాలను కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కూడా డిస్‌క్లెయిమర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుడు వాణిజ్య ప్రకటనలను అరికట్టేందుకు ఈ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (social media influencers) మార్కెట్ 2021లో 900 కోట్ల ఉండగా, అది 2025 నాటికి 2200 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మార్కెట్ ప్రతి ఏడాది 25 శాతం పెరుగుతోందని తెలిపింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండార్సమెంట్లకు చెందిన కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
ఈ రూల్స్ సెలబ్రిటీలు, వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు అందరికీ వర్తిస్తాయి.
బయట ఏదైనా ప్రొడెక్ట్ కొనేటప్పుడు ఎలా ఉందో చూసుకుని తీసుకుంటాం. కానీ ఆన్ లైన్ లో తీసుకునేటప్పుడు అవేమీ చూసే వీలుండదు.
అలాంటప్పుడు ఎక్కువగా రివ్య్వూస్ పై ఆధారపడాల్సిందే. అయితే ఇదే అదునుగా ఫేక్ రివ్వ్యూ లతో కొన్ని కంపెనీలు కస్టమర్లను బోల్తా కొట్టిస్తున్నాయి.
ఇలా వినియోగ దారులను తప్పుదోవ పట్టించేలా, కన్ ఫ్యుూజ్ చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుననేలా ఈ గైడ్ లైన్ ను ప్రవేశ పెట్టింది.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ రూల్స్ ను ఉల్లంఘిస్తే వారికి భారగా ఫైన్ వేయనున్నారు.
2019 వినియోగదారు రక్షణ చట్టం కింద ఆ ఫైన్ వేస్తారు. ఉత్పత్తి దారులు, అడ్వటైజర్లు, ఎండార్సర్లపై సమారు 10 లక్షల వరకు జరిమాన విధిస్తారు.
ఒకవేళ ఉల్లంఘన రిపీట్ అయితే 50 లక్షల వరకు ఫైన్ విధించవచ్చు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ జరిమానాను విధిస్తుంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/