Site icon Prime9

Reddit: రెడిట్‌ లో భారీ ఎత్తున కోతలు.. నియామకాలు కూడా అదే దారిలో

Reddit

Reddit

Reddit:టెక్‌ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌ భారీగా లే ఆఫ్స్ విధించినట్టు తెలుస్తోంది. సంస్థలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది. సంస్థలో దాదాపు 5 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపుతున్నట్టు తెలుస్తోంది. 5 శాతం అంటే దాదాపు 90 మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం రెడిట్ లో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

లేఆఫ్స్ ల సమాచారాన్ని కంపెనీ సీఈవో హవ్‌మన్‌ ఉద్యోగులకు ఓ మెమో ద్వారా తెలిపారు. కంపెనీ ప్రణాళికలను సమీక్షించి 2024 చివరి నాటికి ఒక రూపుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని సీఈఓ పేర్కొన్నారు. ‘ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కంపెనీ ఫలితాలు బలంగా ఉన్నాయి. కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణ ఫలితంగా ద్వితీయార్థంలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు.

 

భారీగా తగ్గిన నియామకాలు(Reddit)

రానున్న ఏడాదికి బ్రేక్‌ ఈవెన్‌ సాధించడంతో పాటు, డేటా, ఏపీఐ టూల్స్‌కు నిధులు సమకూర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్టున్నట్టు రెడిట్‌ పేర్కొంది. అదే విధంగా థర్డ్‌పార్టీ యాప్‌ డెవలపర్స్ కోసం ధరలు పెంచే విషయంపై కూడా ఆలోచిస్తున్నామని కంపెనీ తెలిపింది. మరో వైపు ఈ ఏడాదిలో నియామకాలు తగ్గించుకునేందుకు రెడిట్‌ భావిస్తున్నట్టు సమాచారం. రెడిట్ ఈ ఏడాది 300 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ సంఖ్యను 100 కు తగ్గించుకుంది.

 

 

Exit mobile version