Instagram: ఇన్‌స్టా దీనికి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఉండే ఫీచర్లు నేటి యువతరానికి తెగ నచ్చేశాయనుకోండి. సామాజిక మాధ్యమైన ఇన్‌స్టా వాడని యువత ఉండరు అనడంలో ఆశ్చర్యంలేదు. అయితే వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.
రీల్స్ ఫీచర్ సక్సెస్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ‘నోట్స్’పేరిట మరో కొత్త తరహా ఫీచర్‌ను ఇన్‌స్టా లవర్స్ కు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో ఇన్‌స్టా యూజర్లు 60 అక్షరాల పరిమితితో సంక్షిప్త నోట్స్‌ను క్రియేట్ చేసి పోస్ట్ చేయవచ్చు. యూజర్లు క్రియేట్ చేసే ఈ నోట్స్ తమను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారికి డైరెక్ట్ మెసేజ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగానే ఈ నోట్స్ కూడా 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. యూజర్లు క్రియేట్ చేసిన నోట్స్‌కు ఇతరులు తమ కామెంట్ను కూడా డైరెక్ట్ మెసేజ్ సెక్షన్‌లోనే ఇవ్వవచ్చు.
ఇదీ చదవండి: టెక్నాలజీ ఉపయోగించి ఢిల్లీ నుంచి స్వీడన్‌లో కారు నడిపిన ప్రధాని మోదీ