Site icon Prime9

New Twitter CEO: త్వరలో ట్విటర్ కు కొత్త బాస్.. ఆమె అంటూ జోరుగా ప్రచారం

New Twitter CEO

New Twitter CEO

New Twitter CEO: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌ సీఈఓ ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ సీఈఓగా మరికొద్ది రోజుల్లో కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా రాబోతున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఇతర విషయాలను మస్క్‌ చెప్పలేదు. ట్విటర్‌ సీఈఓ బాధ్యతల నుంచి తాను వైదొలిగిన తర్వాత ఛీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రొడక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ డిపార్ట్ మెంట్ బాధ్యతలు తీసుకోనున్నట్టు ట్వీట్‌లో మస్క్ పేర్కొన్నారు.

 

జోరుగా ప్రచారం(New Twitter CEO)

అయితే ట్విటర్ కు సీఈఓ గా రానున్న ఆ మహిళ ఎవరు అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు బాగా పరిచయమైన లిండా యాకరినో కొత్త సీఈఓ గా రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్‌బీసీయూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా లిండా యాకరినో ఉన్నారు. ఆమెనే ట్విటర్‌ బాధ్యతలు తీసుకుంటాని తెలుస్తోంది. మస్క్‌ గత కొన్ని వారాలుగా లిండాతో చర్చలు జరుపుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సన్నిహితులు తెలిపారు. దాదాపు సీఈఓగా లిండా ఖాయం అవుతుందనే ట్విటర్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో యాకరినో.. మస్క్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఎప్పటి నుంచో వీరివురి మధ్య మంచి స్నేహం ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. లిండా దాదాపు దశాబ్ద కాలంగా ఎన్ బీసీ యూనివర్సిల్ లో పనిచేస్తున్నారు. కమర్షియల్ యాడ్స్ ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై లిండా పని చేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

అంతకు ముందు 19 ఏళ్ల పాటు టర్నర్‌ ఎంటర్ టైన్మెంట్ లో యాకరినో సేవలందించారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో లిండా కీలకంగా వ్యవహరించారు.
లిండా పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ లో డిగ్రీ చేశారు.

 

సీఈఓ రేసులో మరో మహిళ

మరో వైపు ప్రస్తుతం ట్విటర్‌లో ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగానికి ఇంఛార్జిగా ఉన్న ఎల్లా ఇర్విన్‌ కూడా సీఈఓ రేసులో ఉన్నట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ తెలిపింది. ఇటీవల పదోన్నతి పొందిన ఆమె ఎలాన్‌ మస్క్‌తో కలిసి చాలా చురుగ్గా పనిచేస్తున్నారని తెలుస్తోంది.

కాగా, ట్విటర్‌కు కొత్త సీఈఓను నియమిస్తామనని ఎలాన్‌ మస్క్‌ గతంలోనే సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌, టెస్లా సహా మరికొన్ని కంపెనీలకు ఆయన నాయత్వం వహిస్తున్నారు. దీంతో విశ్రాంతి లేకుండా పని ఉంటోందని గతంలో మస్క్ స్వయంగా చెప్పారు. మరోవైపు ట్విటర్‌ సీఈఓ గా తాను వైదొలగాలా అని గత డిసెంబర్‌లో పోల్‌ నిర్వహించారు. అందులో 57. 5 శాతం మంది అవును అనే సమాధానం ఇచ్చారు.

 

Exit mobile version