Twitter: ఇకపై ట్విటర్ లో సినిమాలు, గేమ్స్ నెట్టింట హల్ చేయనున్నాయి. ఆ దిశగా ట్విటర్ అధినేత ఎలన్ మాస్క్ పావులు కదుపుతున్నారు. మరో వైపు ఇప్పటివరకు ఉన్న ట్విటర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీని కూడా మార్పులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఎలన్ మస్క్ చేసుకొన్నట్లు తెలుస్తుంది.
వ్యాపార ప్రకటనలను అందించే ఒక మంచి వేదికగా ట్విటర్ ను తీర్చి దిద్దేందుకు మస్క్ తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లోని వ్యక్తులు ట్విటర్ ను వినియోగిస్తున్న క్రమంలో ఆహ్లాదాన్ని అందించే సినిమా, మేధస్సును పెంచే గేమ్స్ ను వినియోగదారులకు అందివ్వాలన్న ఆలోచన పై ఆయన సుదీర్ధంగా నిపుణులతో చర్చించిన్నట్లు తెలుస్తుంది.
ట్విట్టర్‌ను డబ్బు సంపాదనకు టేకోవర్ చేయడం లేదని, మానవత్వాన్ని పెంపొందించేందుకు కొనుగోలు చేశానని తెలిపారు. ఎలన్‌మస్క్. అలా ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే ఇలా సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెహగల్, లీగల్ ఎఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెలను తొలగించేశారు. ట్విట్టర్‌లో ఫేక్ లేదా స్పామ్ అకౌంట్ల పై తనతోపాటు ఇన్వెస్టర్లను పరాగ్, మిగతా ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు తప్పుదోవ పట్టించారని మస్క్ ఆరోపిస్తూ సైలంట్ గా వారిని తొలగించారు. Twitter Employees: ఉద్యోగుల తొలగింపు.. పునరాలోచించండి.. ఎలాన్ మస్క్ కు లేఖ
ట్విటర్ లో పని చేస్తున్న 7500 మంది ఉద్యోగుల్లో భారీ కోతతో ఇంటికి సాగనంపుతారని ఇటీవల కధనాలు వెలువడ్డాయి. అయితే అలాంటి అధిక ప్రభావం ఉండదని మస్క్ చెప్పిన్నప్పటికి, ముగ్గురు కీలక ఉద్యోగులను బాధ్యతల నుండి తప్పించడంతో ఉద్యోగుల్లో ఆందోళనలు అధికమౌతున్నాయి. మరోవైపు వర్క్ ఫ్రం హోం ను ట్విటర్ లో పనిచేస్తున్న వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాని ఎలన్ మాస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో అందరూ వేచిచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Elon Musk: ట్విటర్ సీఈఓను తొలగించిన ఎలాన్ మస్క్