Meta work policy: దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి. ఈ నూతన వర్క్ పాలసీ అమల్లోకి వస్తే కనీసం వారానికి మూడు రోజులు ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది.
ఉద్యోగులు పనితీరుపై సంతృప్తి(Meta work policy)
వర్క్‌లో సమర్ధత, ఉత్పాదకత లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీని అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే, రిమోట్ వర్క్‌కి పరిమితమైన ఉద్యోగులు వారి ప్రస్తుత స్థానాల నుంచే విధులు నిర్వహించేందుకు మెటా అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు కొత్త వర్క్ పాలసీ విషయంలో ఉద్యోగులు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఆఫీస్ నుంచి లేదంటే ఇంటి నుంచి పని చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పులు ఉండవని.. వారు సమర్ధవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ నివేధించింది.
ఉద్యోగుల మధ్య పాజిటివ్ వర్క్ ఎన్విరాన్ మెంట్(Meta work policy)
ఉద్యోగుల మధ్య సహకారం, సంబంధాలు, పాజిటివ్ వర్క్ ఎన్విరాన్ మెంట్ ను తీసుకొచ్చేందుకు కొత్త పని విధానంపై పనిచేస్తున్నట్టు ఓ మెటా ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మార్చి నెలలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే ఇంజినీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచరులతో కలిసి పనిచేసినప్పుడే మెరుగైన పనితీరు కనబరుస్తామనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నూతన వర్క్ పాలసీని మెటా అమలు చేసేందుకు సిద్ధమైంది.