Site icon Prime9

Meta Layoffs: తాజా రౌండ్ లో భారత్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇంటికే..

Meta Layoffs

Meta Layoffs

Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా.. సంస్థలో ఉద్యోగుల తొలగింపు పై స్పీడ్ పెంచింది. తాజాగా మరో 6,000 మందిని ఇంటికి పంపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగానే మెటా లో లేఆఫ్స్ ఉంటాయని. మార్చిలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

భారతీయ ఉద్యోగులు సైతం(Meta Layoffs)

దాదాపు 10 వేల ఉద్యోగాలు తీసివేయనున్నట్టు ఈ ఏడాది మార్చిలోనే మెటా ప్రకటించింది. వీటిని ఏప్రిల్‌, మే నెలలో రెండు విడతలుగా చేపడతామని తెలిపింది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో 4 వేల మందిని ఇంటికి పంపించింది. మిగిలిన 6 వేల మందిని తాజాగా తొలగించినట్టు వెల్లడించింది. ఈ కోతలు మార్కెటింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌ సహా చాలా విభాగాల్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్కువగా తొలగింపులు ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థలో ఎఫెక్ట్ అయిన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

మెటా తాజా తొలగింపుల్లో ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులూ ఉన్నారు. పింక్‌ స్లిప్స్‌ అందుకున్న వారిలో భారత్‌ నుంచి పలువురు ఉన్నత ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. దేశంలో మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, హెచ్ ఆర్ విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.

అలీబాబాలో భారీగా నియామకాలు(Meta Layoffs)

మరో వైపు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపుతుంటే.. చైనాకు చెందిన ఇ కామర్స్‌ దిగ్గజం అలీబాబా మాత్రం భారీ ఎత్తున నియామకాలను చేపట్టింది. మొత్తం 6 విభాగాల్లో 15 వేల మందిని విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. వీరిలో 3,000 మందిని ఫ్రెషర్స్ ను తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు అలీబాబా ఉద్యోగులను తొలగించనున్నట్టు వస్తున్న వార్తలను కంపెనీ కొట్టి పారేసింది. అయితే, అలీబాబా క్లౌడ్‌ డివిజన్‌ లో మాత్రం 7 శాతం ఉద్యోగులను తొలగించింది.

 

Exit mobile version