Site icon Prime9

Linda Yaccarino: ట్విటర్ సీఈఓ గా లిండా యాకరినా నియామకం

Linda Yaccarino

Linda Yaccarino

Linda Yaccarino: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ నుంచి ఆమె సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ బాస్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన టాలెంట్ తో మంచి ఫ్యూచర్ ను సృష్టించే మస్క్ నుంచి తాను ఎంతో ప్రేరణ పొందినట్టు తెలిపారు. ట్విటర్ భవిష్యత్ కు కట్టుబడి ఉంటానని, ట్విటర్ 2.0 ని రూపొందించడానికి యూజర్ ఫీడ్ బ్యాక్ చాలా కీలకమని ఆమె అన్నారు.

 

లిండా దృష్టి వాటిపైనే: ఎలాన్

ట్విటర్‌ వ్యాపార కార్యకలాపాలపైనే ప్రధానంగా లిండా దృష్టి సారిస్తారని ట్విటర్‌ ద్వారా మస్క్‌ తెలియ జేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, సీటీఓ హోదాలో ప్రోడక్ట్‌ డిజైన్‌, కొత్త సాంకేతికతల బాధ్యతలను తానే నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా.. గత ఏడాది అక్టోబర్ లో ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు పలు వివాదాలకు దారి తీశాయి. మొదటగా ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్‌కు ఛార్జీలు లాంటివి ప్రముఖంగా చెప్పొచ్చు. మరోవైపు కంపెనీ ఆదాయం కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకున్న లిండా.. ఈ సవాళ్లను అధిగమించి ఆదాయపరంగా సంస్థను ముందుకు నడిపేందుకు లిండా ఎలా ప్రయత్నిస్తుందోనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

లిండా నేపథ్యం ఇదే

ట్విటర్ సీఈఓగా మరికొద్ది రోజుల్లో కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా రాబోతున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఇతర విషయాలను మస్క్‌ చెప్పలేదు. ట్విటర్‌ సీఈఓ బాధ్యతల నుంచి తాను వైదొలిగిన తర్వాత ఛీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రొడక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ డిపార్ట్ మెంట్ బాధ్యతలు తీసుకోనున్నట్టు ట్వీట్‌లో మస్క్ పేర్కొన్నారు.

ట్విటర్ కు సీఈఓ గా రానున్న ఆ మహిళ ఎవరు అనే దానిపై చర్చ జరిగింది. అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు బాగా పరిచయమైన లిండా యాకరినో కొత్త సీఈఓ గా రానున్నట్టు అందరూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్‌బీసీయూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా లిండా యాకరినో ఉన్నారు. ఆమెనే ట్విటర్‌ బాధ్యతలు తీసుకుంటున్న స్పష్టం చేశారు.

గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో యాకరినో.. మస్క్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఎప్పటి నుంచో వీరివురి మధ్య మంచి స్నేహం ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. లిండా దాదాపు దశాబ్ద కాలంగా ఎన్ బీసీ యూనివర్సిల్ లో పనిచేస్తున్నారు. కమర్షియల్ యాడ్స్ ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై లిండా పని చేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

అంతకు ముందు 19 ఏళ్ల పాటు టర్నర్‌ ఎంటర్ టైన్మెంట్ లో యాకరినో సేవలందించారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో లిండా కీలకంగా వ్యవహరించారు.
లిండా పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ లో డిగ్రీ చేశారు.

 

Exit mobile version