Site icon Prime9

IQoo Neo 7 Smart Phone : ఐకూ సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !

iqoo smart phone prime9news

iqoo smart phone prime9news

IQoo Neo 7 :  ఐకూ నియో 7 స్మార్ట్ ఫోనును లాంచ్ చేయనుంది.ఐకూ నియో 6కు సక్సెసర్‌గా ఇది రానుంది.ఐకూ నియో 7 స్మార్ట్‌ఫోన్‌ ఈనెల 20వ చైనాలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఐకూ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది.మిడ్ రేంజ్‌లో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐకూ దీన్ని తీసుకురానుంది.IQoo నియో 7కు Display ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఐకూ నియో 7 Display Size 6.78 ఇంచులుగా ఉంటుందని సమాచారం. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది.ఈ స్మార్ట్ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలిసిన సమాచారం. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోనులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుందని తెలుస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ కూడా ఉండనుంది. IQoo నియో 7 ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉండనుండగా.. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Read Also: MI SMART PHONE: ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఈ స్మార్ట్ వాచ్ ఫ్రీ !

ఈ నెల 20వ చైనీస్ మార్కెట్‌లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

Exit mobile version