Site icon Prime9

Instagram: ఇన్ స్టాలో సరికొత్త ఫీచర్.. మ్యూజిక్ ప్రియులకు రచ్చే

instagram new update prime9news

instagram new update prime9news

Instagram: ఎప్పటికప్పుడు యూజర్లకు తగినట్టుగా సోషల్ మీడియా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుత కాలంలో ఇన్ స్టాకు మంచి క్రేజ్ ఉంది. వినియోగదారులకు తగినట్టుగా అనేక కొత్త ఫీజర్లను అందుబాటులోకి తెస్తూ సోషల్ మీడియా రంగంలోకి దూసుకుపోతుంది ఇన్ స్టా. అయితే దిగ్గజ కంపెనీ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు సరికొత్త అప్డేట్ ఇచ్చింది. ఇన్ స్టాలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అంతర్గతంగా ఈ ఫీచర్కు సంబంధించి డెవలప్మెంట్ దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రొఫైల్ పేజీలో యూజర్స్ బయో కింద యాడ్ చేసుకున్న సాంగ్ కనిపిస్తుంది. త్వరలో రాబోయే ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ప్రోటోటైప్‌గా ఉంది. ఇంకా యూజర్లకు అందుబాటులోకి రాలేదు. ఇన్‌స్టాగ్రామ్ అధికార ప్రతినిధి ఒకరు దీనిని ధ్రువీకరిస్తూ ఇంటర్నల్ ప్రోటోటైప్‌గా ఉందని, ఇంకా బీటా టెస్టింగ్‌కు రాలేదని వివరించారు. కానీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్ లైబ్రరీ నుంచి గానీ, థర్డ్ పార్టీ యాప్స్ నుంచి గానీ సాంగ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ యాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు వాళ్లు ఇంకో ఖాతా క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉండే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరినైనా కావాలని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారి ఇబ్బందుల నుంచి ఈ యాప్ రక్షణ కల్పిస్తుంది. నచ్చని పదాలతో కూడిన కామెంట్స్ ఎవరైనా చేస్తే హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ ద్వారా ఆ కంటెంట్‌ను తొలగించివేస్తుంది. ఇలా ఇన్ స్టా పలు రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇదీ చదవండి: గంటల అంతరాయం తర్వాత పాక్షికంగా వాట్సాప్ సేవలు పునరుద్ధరించబడ్డాయి

Exit mobile version