Site icon Prime9

CCI fines Google: గూగుల్‌కు షాకిచ్చిన సిసిఐ.. రూ.936 కోట్ల జరిమానా

Google was shocked by CCI... Rs.936 crore fine

Google was shocked by CCI... Rs.936 crore fine

New Delhi: దేశానికి చెందిన కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) మరోమారు గూగుల్ కు షాకిచ్చింది. రూ. 936కోట్లు జరిమానా విధించింది. ఈ నెల 20న రూ. 1,337-79కోట్ల జరిమానాను మరిచిపోకముందే సిసిఐ మరో మారు గూగుల్ కు భారీగా వడ్డించింది. దీంతో గూగుల్ కు విధించిన మొత్తం జరిమానా రూ. 2,274 కోట్లకు చేరుకొనింది.

ప్లే స్టోర్ పాలసీలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన క్రమంలో ఈ జరిమానాను సిసిఐ విధించింది. నిర్ణీత వ్యవధిలోగా పద్దతి మార్చుకోవాలని సెర్చ్ దిగ్గజానికి ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ తన పేమెంట్స్ యాప్, ఇన్ యాప్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేసేందుకు తన ఆధిపత్య మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసినట్టు ఈ నెలలో జరిగిన యాంటీ ట్రస్ట్ విచారణలో తేలినట్టు సీసీఐ తెలిపింది. కాగా, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో స్టిస్టంలో కూడా గూగుల్ దుర్వినియోగం చేసి ఉంది.

ఇది కూడా చదవండి: Huge Fire Accident: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 200 దుకాణాలు

Exit mobile version