Site icon Prime9

Google: ఇకపై పాస్‌వర్డ్‌ లేకుండానే గూగుల్ అకౌంట్‌లో లాగిన్..!

password less login released by google

password less login released by google

Google: గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ అవ్వొచ్చు. గూగుల్ యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు  ఆండ్రాయిడ్ డివైజ్‌లు క్రోమ్ కోసం కొత్త పాస్‌కీ అనే ఫీచర్‌‌ను రిలీజ్ చేసింది. దీని ద్వారా మీ పాస్‌వర్డ్‌ని ఉపయోగించకుండానే ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ చేసేందుకు పిన్‌ లు లేదా బయోమెట్రిక్ ఉపయోగించవచ్చు. వినియోగదారులు తమ ఐడెంటిటీ అథెంటికేషన్ కోసం ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.

ట్రేడేషనల్ టూ-ఫ్యాక్టర్ పద్దతి కన్నా గూగుల్ యూజర్ల ఇది సురక్షితమైన ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ ఏడాది మే లో మైక్రోసాఫ్ట్ , ఆపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు యూజర్లకు సాధారణ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఆప్షన్ ప్రకటించాయి. దీనిని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, FIDO అలయన్స్ డెవలప్ చేసిన “పాస్ కీ” అని పిలుస్తారు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలపర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా గూగుల్ ఈ ఏడాది చివరిలో సాధారణ యూజర్లకు ఈ పాస్ కీ(passkey) ఫీచర్‌ను అందించాలని చూస్తుంది.

ఇదీ చదవండి: 5జీ స్పీడ్ టెస్ట్ లో అదరగొట్టిన జియో.. డౌన్లోడ్ స్పీడ్ ఎంతో తెలుసా..?

Exit mobile version