Site icon Prime9

Realme c33: ఔరా.. రూ. 549 స్మార్ట్ ఫోన్ కొనవచ్చు..!

realme c 33 smart phones

realme c 33 smart phones

Realme c33: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి సీ 33 స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డీల్ లభిస్తోంది. రియల్‌మి కంపెనీ వారు కొద్ది నెలల క్రితం అదిరే బ్యాటరీ సామర్థ్యం, సూపర్ కెమెరా ఫీచర్లతో సరసమైన ధరలో సీ 33 ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కాగా ఈ ఫోన్‌పై ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ వంటివి లభిస్తున్నాయి.

3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ గల వేరియంట్‌ ధర రూ. 11,999 నుంచి ప్రారంభం అవుతుండగా.. తాజాగా దీన్ని ఇప్పుడు రూ. 8799కు సొంతం చేసుకోవచ్చు. అంటే రూ. 3,200 వరకు డిస్కౌంట్ లభిస్తోందనమాట. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా 5 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది ఫ్లిప్‌కార్ట్. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ. 8250 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు కేవలం రూ. 549కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది  మీరు ఎక్స్ ఛేంజ్ చేసే ఫోన్ బట్టి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ వద్దనుకుంటే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. నెలకు ఈఎంఐ రూ. 791 నుంచి ప్రారంభమవుతోంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ రియల్‌మి బడ్జెట్ ఫోన్‌లో 6.5 అంగుళాల స్క్రీన్, యూనిసోక్ టీ612 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో మైక్రో ఎస్‌డీ కార్డు పెట్టుకోవచ్చు.

ఇదీ చదవండి: ఇకపై ట్విట్టర్ “బ్లూ టిక్”కూ డబ్బులు..!

Exit mobile version