Amazon Prime lite: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది. దీని ధరలను రూ. 999 గా అమెజాన్ నిర్ణయించింది. ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ ఏడాది కాల వ్యవధితో వస్తోంది. ఇందులో నెలవారీ, త్రైమాసిక ప్లాన్స్ లేవు. ఇప్పటి వరకు లైట్ ప్లాన్ ను కొందరికే అందుబాటులో ఉంచిన అమెజాన్ తాజాగా వినియోగదారులందరికీ లైట్ సేవలు అందిస్తోంది.
ఏడాది కాల సబ్‌స్క్రిప్షన్ తో(Amazon Prime lite)
ఈ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులు అమెజాన్‌లో ఉచితంగా రెండు రోజుల డెలివరీ, స్టాండర్డ్ డెలివరీలను పొందొచ్చు. అమెజాన్ , ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్‌తో పాటు బిల్ పేమెంట్స్ లాంటి వాటిపై 2 శాతం క్యాష్‌బ్యాక్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకేసారి రెండు డివైజుల్లో హెచ్‌డీ క్వాలిటీలో ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేసుకునే వీలు ఉంది. అమెజాన్‌లో లైటనింగ్ డీల్స్‌కు ఎర్లీ యాక్సెస్ తో పాటు ‘డీల్స్ ఆఫ్ ద డే’ లో కూడా లైట్ యూజర్లు పాల్గొనొచ్చు.
ప్రైమ్ లైట్ లో ఏముంటాయంటే?(Amazon Prime lite)
అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ లో దాదాపుగా ప్రైమ్ అందించే ప్రయోజానాలు ఉన్నాయి. కొన్ని ప్రయెజనాలు మాత్రం యూజర్లు కోల్పోతారు. ప్రైమ్ లో ఉండే వన్ డే డెలివరీ, సేమ్ డే డెలివరీ సదుపాయం లైట్ ప్లాన్ లో ఉండదు. అదే విధంగా ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ మ్యూజిక్ ను వినియోగించలేరు. రెగ్యులర్ ప్రైమ్ మెంబర్లు.. ప్రైమ్ వీడియోను 4కె క్వాలిటీలో ఒకేసారి 6 డివైజ్ లో చూడగలరు. లైట్ లో హెచ్ డీ క్వాలిటీలో రెండు డివైజ్ లో మాత్రమే చూడొచ్చు. అదే విధంగా ప్రైమ్ లైట్ లో యాడ్స్ కూడా ఉంటాయి. నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఉండదు.
ప్రైమ్ వీడియో, మ్యూజిక్, షాపింగ్, ఈ బుక్స్.. ఇలా అన్నింటికీ కలిపి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది అమెజాన్. గతంలో దీని ధర రూ. 999 గా ఉండగా.. కొన్ని నెలల క్రితం అది రూ. 1,499 కి పెంచుతూ అమెజాన్ నిర్ఱయం తీసుకుంది. దీంతో చాలా మంది యూజర్లు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో కాస్త తక్కువ ధరలో లైట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.