Site icon Prime9

WTC Final: రాహుల్ స్థానంలో యువ బ్యాటర్ కు చోటు ఇచ్చిన బీసీసీఐ

WTC Final

WTC Final

WTC Final: వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జట్టుకు టీంఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు చోటు దక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయ్యాడు కేఎల్ రాహుల్. దీంతో రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, లండన్‌లోని ఓవల్‌ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడునున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఇప్పటికే తుదిజట్టును ప్రకటించింది.

 

రాహుల్ ఔట్.. ఉనద్కత్ డౌట్(WTC Final)

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ తన గాయం ప్రస్తుత పరిస్థితి గురించి ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. త్వరలోనే తాను తొడ భాగంలో సర్జరీ చేయించుకోనున్నట్టు వెల్లడించాడు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. మరో వైపు ఐపీఎల్ 2023 మిగిలిన సీజన్ కు రాహుల్ దూరంగా ఉంటాడు. ఈ క్రమంలో అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ.. అతని స్లానంలో ఇషాన్ కిషన్ ను సెలక్షన్ ఎంపిక చేసినట్టు తెలిపింది.

మరో వైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికై ఐపీఎల్‌లో భాగంగా నెట్స్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్ చేస్తూ జయదేవ్ ఉనద్కత్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉనద్కత్ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. వీరిద్దరూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ కు అందుబాటులో ఉంటారా లేదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది.

స్టాండ్ బై ప్లేయర్లుగా ఆ ముగ్గురు

అదే విధంగా ఐపీఎల్‌ 16 సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ కు బంపరాఫర్‌ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా గైక్వాడ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడితో పాటు పేసర్‌ ముఖేష్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు కూడా స్టాండ్‌బై జాబితాలో చోటు దక్కింది.

 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఎంపికైన టీమిండియా జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌)

స్టాండ్‌ బై ప్లేయర్లు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌

 

Exit mobile version