Site icon Prime9

World Boxing: మహిళల బాక్సింగ్ ప్రపంచకప్.. స్వర్ణం సాధించిన నీతూ

world boxing

world boxing

World Boxing: ప్రపంచ మహిళల బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. దిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2023 లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది.

స్వర్ణం సాధించిన 22 ఏళ్ల నీతూ

ప్రపంచ మహిళల బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. దిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2023 లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది. 48 కేజీల విభాగం ఫైనల్ బౌట్‌లో నీతూ ఘంగాస్ మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్‌ అల్‌టాంట్‌సెట్‌సెగ్‌పై 5-0 తేడాతో విజయం సాధించి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. హర్యాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి వెలుగులోకి వచ్చింది.

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2023లో తొలి బౌట్‌ నుంచి ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన నీతూ.. తొలి 3 బౌట్‌లను రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేడంతో విజయం సాధించింది.

సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై 5-2 తేడాతో విజయం సాధించిన ఘంగాస్‌. ఫైనల్లో మంగోలియా బాక్సర్‌ను మట్టికరిపించి పసిడి పట్టింది.

కాగా, ఇవాళే జరిగే మరో పసిడి పోరులో సావీటీ బూరా (81 కేజీలు) కూడా తన అదష్టాన్ని పరీక్షించుకోనుండగా.. రేపు జరిగే మరో రెండు పసిడి పోరాటాల్లో లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), ప్రస్తుత వరల్డ్‌ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) వేర్వేరు ప్రత్యర్ధులతో పోటీ పడనున్నారు.

 

Exit mobile version