Site icon Prime9

FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌.. జాతీయగీతం పాడటానికి ఇరాన్ ఆటగాళ్లు ఎందుకు నిరాకరించారు ?

Why Iranian players refused to sing the national anthem

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లోఇంగ్లండ్‌, ఇరాన్‌ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడగా.. ఇరాన్ జట్టు మాత్రం జాతీయ గీతం పాడకుండా నిరసన తెలియజేసింది. ఇలా చేయడంతో సంప్రదాయం పేరిట మహిళల హక్కులను కాలరాస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి ఖతార్ వేదికగా ఫిఫా వర్డల్ కప్‌లో భారీ షాక్ తగిలింది. ప్రారంభకార్యక్రమంలో ఇరాన్ జట్టు సభ్యులందరూ జాతీయ గీతాలాపనకు బదులు మౌనం దాల్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతీయ గీతం ఆలపించాలా వద్దా అనేది జట్టు సభ్యులు అందరూ ఉమ్మడిగా నిర్ణయిస్తారని జట్టు కెప్టెన్ అలీరెజా జహాన్ బక్ష అంతకుముందు పేర్కొన్నారు.

ఇక స్టేడియంలోని ఇరాన్ మహిళా అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు. దీంతో.. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ఓడినా.. మనసులు గెలుచుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.తమ హక్కుల కోసం ఇరాన్ మహిళలు రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. హిజాబ్ ధరించని కారణంగా జైలు పాలైన మాసా అమీనీ పోలీసు కస్టడీలోనే మృతి చెందడంతో ఇరాన్‌లో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. తొలుత చిన్నపాటి నిరసనల కార్యక్రమాలుగా మొదలైన మహిళల ఆగ్రహ జ్వాల చూస్తుండగానే.. యావత్ దేశాన్ని చుట్టుముట్టింది వేల సంఖ్యలో యువతులు, మహిళలు వీధుల్లో కదనుతొక్కుతూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సంప్రదాయం పేరిట తిరోగమన విధానాలను ప్రోత్సహిస్తూ తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు. ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీరెజా జహాన్ బక్ష చెప్పాడు.

Exit mobile version