Site icon Prime9

Virat Kohli: మూడోసారి గోల్డెన్ డక్.. విరాట్ కోహ్లీ చెత్త రికార్డు

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఐపీఎల్‌ 2023 లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. రాజస్థాన్ బౌలర్ బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా కోహ్లీకి వెనుదిరిగాడు. అయితే సొంతమైదానంలో ఆర్సీబీ ఆడుతుండటంతో.. అప్పటివరకు చిన్న స్వామి స్టేడియం కోహ్లి నామస్మరణతో హోరెత్తింది. ఈ క్రమంలో ఆశ్చర్యకరంగా కోహ్లి ఔట్‌ అవడంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది. అంతేకాకుండా తాను డకౌట్ అవ్వడంతో తీవ్ర నిరాశ చెందిన కోహ్లి కూడా కనీసం నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్‌ను కూడా చూడకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు.

 

చెత్త రికార్డు నమోదు(Virat Kohli)

అయితే కోహ్లీ ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన వారి లిస్ట్ లో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ తో కలిపి కోహ్లీ 7సార్లు గోల్డెన్‌డక్‌ అవ్వగా.. సునీల్‌ నరైన్‌, హర్బజన్‌ సింగ్‌లతో కలిసి కోహ్లి సంయుక్తంగా ఉన్నాడు. ఇక ఈ లిస్ట్ లో తొలి స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 10 గోల్డెన్‌ డకౌట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. కాగా, విరాట్ కోహ్లీకి ఏప్రిల్ 23 కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఇదే ఆర్సీపీ తరపున కోహ్లీ ఆడిన 3 మ్యాచుల్లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అంతేకాకుండా కోహ్లీ గోల్డెన్ డక్ అయిన 2 సందర్బాల్లో ఆర్సీబీ కి ఓటమి పాలైంది.

 

మరోసారి అదరగొట్టిన ఆర్సీబీ(Virat Kohli)

కాగా, సొంత మైదానంలో ఆర్సీబీ మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో బెంగళూరు విక్టరీ కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బ్యాటర్స్ లో యశస్వి జైస్వాల్ (47) , దేవదత్‌ పడిక్కల్ (52), ధ్రువ్‌ జురెల్‌ (33) రాణించినా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సిరాజ్‌, డేవిడ్‌ విల్లీ చెరో వికెట్ తీసుకున్నారు.

ఇక బెంగళూరు బ్యాటర్స్ లో మ్యాక్స్‌వెల్ (77), డు ప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులతో మెరిపించడంతో మొదట బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ సులువుగా 220 స్కోరు సాధించేలా కనిపించినా.. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ 200 లోపలే నమోదైంది. చివరి 7 ఓవర్లలో ఆర్సీబీ.. 7 వికెట్లు కోల్పోయి 54 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్‌ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టగా అశ్విన్‌, చాహల్ చెరో వికెట్ తీశారు.

 

 

Exit mobile version