Site icon Prime9

Virat Kohli: సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఇన్ని రోజులు లీగ్ మ్యాచులతో అలరించిన ఐపీఎల్ 2023 లో మంగళవారం నుంచి అసలు సిసలైన ఆట మొదలుకానుంది. ఈ రోజు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్యాలిఫెయిర్ మ్యాచ్ జరుగనుంది. అయితే అంతకుముందు మ్యాచ్ లో ఎలాగైనా ప్లే ఆఫ్స్ కు చేరాలనుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు మళ్లీ నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసినా.. బౌలర్లు విఫలం కావడంతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

 

అభిమానులకు రుణపడి ఉంటాం(Virat Kohli)

‘ఈ సీజన్ లో మెరుగ్గా ఉన్నా దురదృష్టవశాత్తూ మనం లక్ష్యానికి కొద్ది దూరంలో ఆగిపోయాం. నిరాశగా ఉన్నా మనం ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు ఎంతో అండగా ఉన్న అభిమానులకు రుణపడి ఉంటాం. మా కోచ్ లు, మేనేజ్ మెంట్, జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. మరింత బలంగా తిరిగొస్తాం’ అంటూ కోహ్లీ పోస్ట్ చేసి.. Thank you Bengalure అని ఫొటోలు షేర్ చేశాడు.

 

 

ఐపీఎల్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ పై 61 బంతుల్లో 101 లో అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ శతకాలున్నాయి. తాజా సీజన్‌లో ఇప్పటివరకు డుప్లెసిస్‌(730), శుభ్‌మన్‌ గిల్‌(680) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు.

 

ముందుగానే లండన్‌కు

ఐపీఎల్‌లో ఆర్సీబీ పోరాటం ముగియడంతో విరాట్‌ కోహ్లి ముందుగానే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కు వెళ్లనున్నాడు. మంగళవారం కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌.. భుజం గాయం నుంచి కోలుకుంటున్న జయదేవ్‌ ఉనద్కత్‌ బయలుదేరుతారు. చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలోని సహాయ సిబ్బంది కూడా ఫస్ట్ టీమ్ లోనే వెళ్తున్నారు.

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఉన్న నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జడేజా, ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ షమి, శ్రీకర్‌ భరత్‌, ఆజింక్య రహానెలు ఇండియాలో ఉన్నారు. వీళ్లంతా కలిసి రెండో టీమ్ గా వెళ్తారు. వచ్చే నెల 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగుతుంది.

 

Exit mobile version