Site icon Prime9

Under 19 Womens: అండర్ -19 మహిళల ప్రపంచ కప్ గెలిచిన భారత్

under 19 womens

under 19 womens

Under 19 Womens: అండర్- 19 మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొట్టతొలి అండర్ -19 ప్రపంచకప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాలో జరుగుతున్న తొలి అండర్-19 మహిళల ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది.

అండర్-19 మహిళల ప్రపంచకప్ లో భారత్ జయకేతనం ఎగరవేసింది. ఇంగ్లాండ్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను 68 పరుగులకే భారత్ కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో కేవలం 14 ఓవర్లలో మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో తొలి అండర్-19 ప్రపంచ కప్ ను మహిళల జట్టు గెలుచుకుంది.

69 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మహిళల జట్టు ఆడుతు పాడుతూ విజయాన్ని అందుకుంది.

భారత Team India జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

మహిళల బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ (15), శ్వేత్‌ సెహ్రావత్‌ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత సౌమ్య తివారి (23), హ్రిషత బసు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

ఇంగ్లాండ్‌ బౌలర్లలో హన్నా బేకర్‌, కెప్టెన్‌ గ్రేస్‌ స్కీవెన్స్‌, అలెక్సా స్టోన్‌హౌస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో మెుదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్  ఇండియా బౌలర్ల ధాటికి కుప్పకూలింది.

నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్ వుమెన్ ను బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు.
ఏ దశలోనూ ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్స్ కోలుకోలేకపోయారు. కేవలం 68 పరుగులకే ఆలౌటయ్యారు.

భారత బౌలింగ్ లో టిటాస్‌ సాధు, పర్శవి చోప్రా, అర్చనా దేవీ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.

మన్నత్‌ కశ్యప్‌, షెఫాలీ వర్మ, సోనమ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. టీ20 ఫార్మాట్‌లో ఇది తొలి వరల్డ్ కప్ అవ్వగా.. ఇందులో ఇండియా విజేతగా నిలించింది.

తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.

దీంతో భారత అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యువ మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version