Tushar Deshpande: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ఆటగాడు తుషార్ దేశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన నభా గద్దం వార్ ను దేశ్ పాండే పెళ్లిచేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తుషార్ దేశ్ పాండే, నభా తుషార్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శివవ్ దూబె సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ ఫొటోలను దేశ్ పాండే తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. ‘ స్కూలింగ్ క్రష్ నుంచి నా ఫియాన్సీగా ఆమోకు ప్రమోషన్ వచ్చింది’ అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు దేశ్ పాండే. వీరి వివాహం త్వరలోనే జరుగనుంది.
క్రికెటర్ల శుభాకాంక్షలు(Tushar Deshpande)
కాబోయే జంటకు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్, సిమర్ జిత్ సింగ్ తదితరులు విషెస్ చెప్పారు. కాగా, ఐపీఎల్ 2023 టైటిట్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో దేశ్ పాండే కీలక ఆటగాడు. ఆ జట్టు తరపున ఎక్కువ వికెట్లు తీశాడు. మొత్తం 16 మ్యాచులు ఆడిన తుషార్ 21 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మరో వైపు సీఎస్కే కు చెందిన రుతురాజ్ గైక్వాడ్ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 3 వ తేదీ తన ప్రేయసి ఉత్కర్ష పవార్ ను పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ర్టలో జరిగిన ఈ వివాహ వేడుకలను చెన్నై ప్రజలకు, దక్షిణాది సంస్కృతికి ఈ జంట అంకితమిచ్చింది.