Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫిలో అస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసింది. నాగపూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం అనంతరం టీమిండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
మూడు ఫార్మాట్లలో టీమిండియా అగ్రస్థానం.. (Icc Rankings)
వన్డే, టీ20ల్లో టీమిండియా ఇది వరకే అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ పై తొలి టెస్టు విజయం అనంతరం.. ఈ ఫార్మాట్ లోను మెుదటి స్థానానికి చేరుకుంది. దీంతో ప్రస్తుతం టీమిండియా 115 పాయింట్లతో మెుదటి స్థానానికి చేరుకుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించడం ద్వారా టీమిండియా నాలుగు పాయింట్లు సాధించింది. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది.
రెండో స్థానంలో ఆస్ట్రేలియా..
నాగపూర్ లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఆసీస్ రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇంగ్లండ్ 106 పాయింట్లతో నిలిచింది. న్యూజిలాండ్ 100 పాయింట్లతో నాలుగో స్థానం.. 85 పాయింట్లతో సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి. ఆసీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా స్పిన్నర్లు ఆసీస్ నడ్డి విరిచారు.
రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మ..
మూడు ఫార్మాట్లలో తొలిసారిగా టీమిండియా నెంబర్ వన్ గా నిలవడం ఇదే మెుదటిసారి. ఈ ఘనత అందుకోవడంలో రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఘనత సాధించడంతో హిట్ మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా టీమిండియా వన్డేల్లో నెంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఆ తర్వాత అదే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా అవతరించింది. అయితే ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికి.. అధికారికంగా మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మనే ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇత భారత్, ఆసీస్ మధ్య ఫిబ్రవరి 17 నుంచి దిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.