Site icon Prime9

Asia cup 2022: హంకాంగ్ ను ఓడించిన టీమిండియా

asia cup ind vs hk prime9news

asia cup ind vs hk prime9news

Asia cup 2022: ఆసియా కప్ 2022 బుధవారం హంకాంగ్ జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఆట తీరుకు సీనియర్ క్రికెటర్ల నుంచి ప్రసంసలను అందుకున్నారు. కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేయగా వీటిలో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ తో కోహ్లీ బాగా ఆడటం లేదని విమర్శలు చేసిన వాళ్ళకి తన బ్యాట్ తో గట్టి సమాధానమే చెప్పాడు. సూర్యకుమార్ ఐతే మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు ఇంకో గెలుపును సొంతం చేసాడు. తన బ్యాట్ తో హంకాంగ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు కేవలం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని 68 పరుగులు చేయగా వీటిలో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి .మన సుక్కు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు. ఓపెనర్స్ గా దిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13 బంతుల్లో 21 పరుగులు, మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ 39 బంతుల్లో 36 పరుగులను చేశాడు.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా 120 బంతులకు 2 వికెట్ల నష్టానికి 192 పరుగులను నమోదు చేసింది.పరుగులను ఛేదించడానికి బరిలోకి దిగిన హంకాంగ్ 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భువనేశ్వర్,ఆవేశ్ ఖాన్,అర్షదీప్ జడేజా తలో వికెట్ తీసుకున్నారు.ఈ గెలుపుతో టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నారు.మొత్తానికి మన టీమిండియా మంచి ఆట తీరును కనబరుస్తూ అభిమానలను ఆనదింప చేస్తున్నారు.

Exit mobile version