Sunrisers Hyderabad: కొత్త కెప్టెన్ ను రివీల్ చేసిన సన్ రైజర్స్

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్ - 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్‌ ను ప్రకటించింది.

Sunrisers Hyderabad: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్ – 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్‌ ను ప్రకటించింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన సారధిగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఏడెన్‌ మార్ర్కమ్ ఎంపికయ్యాడు.

ఈ విషయాన్ని ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం గురువారం ట్విటర్ వేదికగా కొత్త కెప్టెన్ పేరును రివీల్ చేసింది.

 

సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేఫ్ విజయంలో(Sunrisers Hyderabad)

ఐపీఎల్ తర్వాత ఈ రేంజ్ లో భావించే సౌతాఫ్రికా టీ20 లీగ్ లో తమ సిస్టర్ ప్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేఫ్ ను ఛాంపియన్ గా ఈ ఏడెన్ మార్క్రమ్ నిలబెట్టాడు.

ఇటీవల జరిగిన ఎస్‌ఏ20 టోర్నీలో మార్క్రమ్ జట్టు విజేతగా నిలిచింది.

దీంతో హైదరాబాద్‌ పగ్గాలను కూడా అతడికే అందించింది యాజమాన్యం.

ఐపీఎల్ వేలానికి ముందు కెఫ్టెన్ గా ఉన్న కేన్ విలియమ్స్ ను సన్ రైజర్స్ వేలానికి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారథి ఎంపిక అనివార్యమైంది.

రేసులో పలువురు పేర్లు వినిపించాయి. మయాంక్ అగర్వాల్, గతంలో కెఫ్టెన్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్, ఏడెన్ మార్క్రమ్ లు కెఫ్టెన్ రేసులో పోటీ పడగా..

ప్రాంఛైజీ సఫారీ ఆటగాడు మార్క్రమ్ కే ఓటు వేసింది.

 

 

మార్క్రమ్‌ వైపే మొగ్గు

కాగా, ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వేలానికి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌ ఎం‍పిక అనివార్యం కాగా.. రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ రేసులో మయాంక్‌ అగర్వాల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌లు పోటీ పడగా.. యాజమాన్యం మార్క్రమ్‌ వైపు మొగ్గు చూపింది.

అయితే, ఎస్ఆర్ హెచ్ కు విదేశీ ఆటగాళ్లు కెఫ్టెన్ గా వ్యవహరించారు.

డేవిడ్ వార్నర్, తర్వాత కేన్ విలియమ్సన్ లు జట్టు ను నడిపించారు. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు సన్ రైజర్స్ కు దూరం అయ్యారు.

దీంతో గత కాలంగా కెఫ్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే మార్క్రమ్‌ లేదా టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ కు కెఫ్టెన్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది.

చివరకు ఎస్ఆర్ హెచ్ సారధిగా మార్క్రమ్ కు అవకాశమిచ్చింది యాజమాన్యం.

 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్ ఇదే..

ఏడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, సమర్థ్‌ వ్యాస్‌, గ్లెన్ ఫిలిప్స్, అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌, హ్యారీ బ్రూక్‌, అబ్దుల్ సమద్, నితీశ్‌కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌

క్లాసెన్‌, ఉపేంద్ర యాదవ్‌, సన్వీర్‌ సింగ్‌, వివ్రాంత్‌ శర్మ, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్‌ మాలిక్‌, టి నటరాజన్, ఫజల్‌ హక్‌ ఫారూఖీ,

భువనేశ్వర్‌ ​కుమార్‌, ఆదిల్‌ రషీద్‌, అకీల్‌ హొసేన్‌, మయాంక్‌ డాగర్‌, మయాంక్‌ మార్కండే