Site icon Prime9

Indian cricketers: మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. కారణం ఇదే

cricketers

cricketers

Indian cricketers: భారత్ క్రికెటర్లు.. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. కొందరు నెటిజన్లు.. వీరిని టార్గెట్ గా చేసుకోని ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

 

ట్రోలింగ్ కు కారణం ఇదే..

భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

నుదిటిపై తిలకం పెట్టడానికి ప్రయత్నిస్తే.. వారు నిరాకరించారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత క్రికెటర్ల బృందం ఓ హోటల్ కు రాగా.. అక్కడి సిబ్బంది క్రికెటర్లకు నుదిటిపై తిలకం దిద్ది స్వాగతం పలికారు.

భారత్ క్రికెట్ లో ని సభ్యులు.. తిలకం పెట్టుకోగా దీనికి ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ నిరాకరించారు.

తిలకం పెట్టుకోవడానికి భారత్ సిరాజ్, ఉమ్రాన్ Umran Malik నిరాకరించడంతో.. వారిపై విపరీతంగా ట్రోలింగ్ ప్రారంభించారు.

వీరితో పాటుగా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, సహాయక సిబ్బందిలో మరోకరు కూడా తిలకం పెట్టించుకోవడానికి నిరాకరించారు.

అభిమానులు మాత్రం.. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లనే లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ముహమ్మద్ సిరాజ్ 15 టెస్టుల్లో 46 వికెట్లు తీశాడు.

గత మ్యాచులో అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాదీ పేసర్.. తిలకం నిరాకరించి వార్తల్లో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు నాగ్ పూర్ లో ప్రాక్టీస్ చేస్తుంది. జట్టు సభ్యులంతా నాగ్ పూర్ లోని ఓ హోటల్ లో బస చేస్తున్నారు.

తమ హోటల్ కు వచ్చిన భారత ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి హోటల్ సిబ్బంది సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.

హోటల్ సిబ్బంది తిలకం పెట్టబోతుండగా సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ వద్దని నిరాకరించారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా వీరు తిలకం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు.

 

ఈ ఇద్దరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

వీరు ఆడుతున్నది భారత జట్టుకు.. పాకిస్థాన్ కు కాదని విమర్శలు చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగినా ఇంకా మత విశ్వాసాలను పాటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం.. సిరాజ్, ఉమ్రాన్ కు బాసటగా నిలిచారు.

విక్రమ్ రాథోడ్, హరి ప్రసాద్ మోహన్ కూడా తిలకానికి నిరాకరించారని, వాళ్లను కాకుండా ముస్లిం ఆటగాళ్లు అయిన సిరాజ్, ఉమ్రాన్ లనే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version