Site icon Prime9

Rishabh Pant: రిషబ్ పంత్ హెల్త్ అప్ డేట్: వారంలో డిశ్చార్జ్ కానున్న పంత్

Rishabh pant

Rishabh pant

Rishabh Pant: టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై , ప్రసుత్తం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో చికిత్స

పొందుతున్న విషయం తెలిసిందే.

కాగా, రిషబ్ పంత్ కు సంబంధించిన హెల్త్ అప్ డేట్ విడుదల చేశారు డాక్టర్లు. పంత్ మోకాలి సర్జరీ విజయవంతం అయినట్టు వారు ప్రకటించారు.

పంత్ వేగంగా కోలుకుంటున్నాడని .. ఈ వారంలో అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, మార్చిలో పంత్ కు మరో విడత మోకాలి సర్జరీ జరుగుతుందని వెల్లడించారు.

పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 నుంచి 9 నెలలు పడుతుందని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో పంత్ కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు తెగపోయిన విషయం తెలిసిందే.

 

కీలక టోర్నమెంట్స్ కు దూరం( (Rishabh Pant)

పంత్ కోలుకునే దశలో ఉండటం వల్ల ప్రస్తుతం జరిగే క్రికెట్  టోర్నమెంట్స్ కు దూరం కావాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా సిరీస్, తర్వాత ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నమెంట్లకు పంత్ దూరం కానున్నాడు.

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కు ప్రత్యామ్నాయం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తోంది.

ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో పంత్ కు చోటు లభించింది.

 

కోలుకోవడానికి 8-9 నెలలు

కాగా, గత ఏడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా పంత్ (Rishabh Pant) కారు ప్రమాదానికి గురి అయింది.

ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోగా.. పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం పంత్ కు జరిగిన సర్జరీలు అన్నీ విజయవంతం అయినప్పటికీ, అతను పూర్తిగా కోలుకోవడానికి 8-9నెలలు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version