Site icon Prime9

RCB Vs LSG : లో స్కోర్ మ్యాచ్ లో హై కిక్.. లక్నోని ఓడించిన బెంగుళూరు.. అదరగొట్టిన బౌలర్లు

RCB Vs LSG match highlights in ipl 2023

RCB Vs LSG match highlights in ipl 2023

RCB Vs LSG : ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ సీజన్ ని గమనిస్తే భారీ టార్గెట్ చేసిన మ్యాచ్ లే కాకుండా.. తక్కువ స్కోర్ చేసిన మ్యాచ్ లు కూడా ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణ అంటే ఈ మ్యాచ్ అనే చెప్పాలి. ముందు బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితం అయ్యింది. టార్గెట్ చిన్నదే అయినా కానీ బెంగుళూరు బౌలర్లు అదరగొట్టడంతో  108 పరుగులకే పరిమితమైంది. దీంతో బెంగళూరు 18 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆర్సీబీ. దీంతో ఏప్రిల్ 10న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి లక్నో విజయం సాధించగా.. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలిచి లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రివేంజ్ తీర్చుకుంది.

బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించని లక్నో పిచ్ మీద ఛేజింగ్ కష్టమనే భావనతో బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ మీద కోహ్లి, డుప్లెసిస్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9 ఓవర్లలో 62 రన్స్ జోడించారు. కోహ్లి (31) ఔటయ్యాక.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్లెవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. దీంతో బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది. 16.5వ ఓవర్లలో జట్టు స్కోరు 109 పరుగుల వద్ద డుప్లెసిస్ (40 బంతుల్లో 44) ఐదో వికెట్‌గా వెనుదిరగ్గా.. కార్తీక్ (16) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 రన్స్ మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు చివరి ఐదు ఓవర్లలో 34 పరుగులు మాత్రమే చేసి.. ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం.

ఇక టార్గెట్ చిన్నదే కావడంతో లక్నో గెలుపు ఖాయం అని అంతా భావించారు. కానీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగకపోవడం లక్నోను పెద్ద మైనస్ అయింది.  ఫామ్‌లో ఉన్న కైల్ మేయర్స్‌ను సిరాజ్ ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్ చేర్చాడు. కృణాల్ పాండ్యా(14), స్టోయినిస్ (19 బంతుల్లో 13), గౌతమ్ (13 బంతుల్లో 23) మినహా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉండటంతో.. లక్నో ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది.  కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. 4 బంతుల వ్యవధిలో వీరద్దరూ పెవిలియన్ చేరడం లక్నోను దెబ్బతీసింది. చివర్లో అమిత్ మిశ్రా (19), నవీన్ ఉల్ హక్ (13) ఆర్సీబీ బౌలర్లకు ఎదురు నిలవడంతో.. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 31 పరుగులు అవసరం అయ్యాయి. 19వ ఓవర్లో బౌండరీ బాదిన నవీన్ ఔట్ కావడంతో.. కేఎల్ రాహుల్ పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

అప్పటికీ సమీకరణం 8 బంతుల్లో 24 రన్స్‌గా మారింది. గాయం కారణంగా రాహుల్ ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి మిశ్రాను హర్షల్ ఔట్ చేశాడు. దీంతో లక్నో 108 పరుగులకు ఆలౌటయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో కరణ్ శర్మ, హేజిల్ వుడ్ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, మ్యాక్స్ వెల్, హర్షల్, హసరంగా చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

 

Exit mobile version