Rajasthan Royals: పంజాబ్ తో రాజస్థాన్ కీలక పోరు.. గెలిస్తేనే నిలుస్తారు

Rajasthan Royals: పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయితే రాజస్థాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

Rajasthan Royals: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. తప్పక గెలవాలి. దీంతో ఇలాంటి మ్యాచ్ లు ఐపీఎల్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. ఇక నేడు జరిగే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో రాయల్స్ తప్పక గెలవాలి. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టడం ఖాయం.

కీలక పోరు.. (Rajasthan Royals)

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. తప్పక గెలవాలి. దీంతో ఇలాంటి మ్యాచ్ లు ఐపీఎల్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. ఇక నేడు జరిగే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో రాయల్స్ తప్పక గెలవాలి. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టడం ఖాయం.

శుక్రవారం ధర్మశాల వేదికంగా..పంజాబ్ కింగ్స్ తో.. రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ కు కీలకం కానుంది.

ఈ మ్యాచ్ లో ఓడితే గనక.. ఆ జట్టు ఇంటిదారి పట్టనుంది. ఇప్పటికే దాదాపు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.

రాయల్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి.. ఆరింట విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

అయితే రాజస్థాన్ కు ఇంకా అవకాశం ఉంది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది.

అయితే రాజస్థాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ తమ తదపరి మ్యాచ్‌ల్లో ఓటమి చెందితే.. ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి.

అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతోంది. అయితే ముంబై, ఆర్సీబీ కంటే రాజస్తాన్‌(+0.140) నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించే ఛాన్స్‌ ఉంటుంది.

ఇక పంజాబ్‌కు కూడా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెథ్యమేటిక్‌గా ఉన్నాయి.

పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కచ్చితంగా రాజస్తాన్‌పై భారీ విజయం సాధించాలి. అంతే కాకుండా ముంబై, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ ఓటమి పాలవ్వాలి.

అప్పుడు ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు నెట్‌రన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.

ట్రెంట్‌ బౌల్ట్‌ ఎంట్రీ.. జంపా ఔట్‌

ఇక పంజాబ్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్తాన్‌ తమ జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది.

గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ పంజాబ్‌తో పోరుకు తిరిగి జట్టులోకి రానున్నట్లు సమాచారం.

బౌల్ట్‌ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా బెంచ్‌కే పరిమితమయమ్యే ఛాన్స్‌ ఉంది.

అదే విధంగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌పై రాజస్తాన్‌ మెనెజెమెంట్‌ మరోసారి నమ్మకం ఉంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.