FIFA WWC 2023: ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023 నేటి నుంచి ప్రారంభమైంది. టోర్నమెంట్ చరిత్రలో ఇది 9వ ఎడిషన్. తొలిసారిగా ఈ ట్రోఫీ మ్యాచ్ ని రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు మహిళల ఫుట్‌బాల్ లీగ్ ని పూర్తి నెలపాటు నిర్వహించనున్నాయి. ఆగస్టు 20న, టోర్నీ టైటిల్ మ్యాచ్ సిడ్నీలోని ఒలింపిక్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. కాగా మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్, నార్వే మధ్య జరగనుంది. మొదటి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ చూడడానికి దాదాపు 50వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌తో పాటు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య తొలిరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ఫిపా కప్ ను గెలుచుకోలేకపోయింది. గతేడాది జరిగిన లీగ్ లో కూడా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 మ్యాచుల్లో ఓటమిపాలై వెనుదిరిగింది.
మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా 32 జట్లు పాల్గొంటుండగా, ఇందులో తొలిసారిగా ఐర్లాండ్ జట్టు ఆడనుంది. ఈ లీగ్ లో పాల్గొనబోయే జట్లను ఒక్కొక్కటి 4 చొప్పున 8 గ్రూపులుగా విభజించారు. ఇందులో ప్రతి గ్రూప్‌లోని టాప్-2 జట్లు రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023లో 64 మ్యాచులు జరుగుతుండగా 9 గ్రౌండ్లు ఇందుకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరి మ్యాచ్‌లు ఆడే ఆ గ్రౌండ్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లతో పాటు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్, డునెడిన్, హామిల్టన్
ఫిపా 2023 మహిళల ప్రపంచకప్ టైటిల్ గెలిచే జట్టుకు గతసారి కంటే 3 రెట్లు ఎక్కువ ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈసారి ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ.86 కోట్లు అందుతాయి. అదే సమయంలో, 2019 సంవత్సరంలో, టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ $ 30 మిలియన్లు కాగా అది ఈసారి $ 110 మిలియన్లకు దగ్గరగా ఉంది.