Site icon Prime9

Ashwin: ఒక్క వికెట్ తీస్తే చాలు.. రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్

ashwin

ashwin

Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మరో ఒక్క వికెట్ తీస్తే.. రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో.. 449 వికెట్లు పడగొట్టాడు. మెుత్తం ఇప్పటివరకు 88 మ్యాచులు ఆడిన అశ్విన్.. 449 వికెట్లతో మరో రికార్డుకు దగ్గరయ్యాడు.

తన స్పిన్ మాయజాలంతో ఎంతో మంది బ్యాటర్లను అశ్విన్ ముప్పుతిప్పలు పెట్టాడు.

అశ్విన్ బౌలింగ్ ని ఎదుర్కొవడం అంటే.. బ్యాటర్లకు వణుకు రావల్సిందే.

అశ్విన్ బౌలింగ్ ని ఎదుర్కొవడానికి ఆసీసీ.. డూప్లికెట్ అశ్విన్ తో ప్రాక్టీస్ చేస్తుందంటే ఆ స్పిన్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు.

ఇక ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌లో అశ్విన్ ఒక్క వికెట్ తీస్తే చాలు 450 వికెట్లు పడగొట్టిన 9వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

అశ్విన్ కు ముందు 8 బౌలర్లు ముందున్నారు. మెుదటి స్థానంలో శ్రీలంక స్పిన్ దిగ్గజం.. ముత్తయ్య మురళీథరన్‌ 800తో ఉన్నాడు.

తర్వాత షేన్‌ వార్న్‌ 708 వికెట్లు, జేమ్స్‌ ఆండర్సన్‌ 675 వికెట్లు, అనిల్‌ కుంబ్లే 619, స్టువర్ట్‌ బ్రాడ్‌ 566, మెక్‌గ్రాత్‌ 563, కోట్నీ వాల్ష్‌ 519, నాథన్‌ లయోన్‌ 460 ఈ ఘనత సాధించారు.

ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో అశ్విన్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా స్పిన్నర్లు కూడా పలు మైలురాళ్లకు చేరువలో ఉన్నారు.

ఆల్ రౌండర్.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 242 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో మరో 8 వికెట్లు తీస్తే 250 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.

ఇక మరో బౌలర్ అక్షర్‌ పటేల్‌ కూడా ఓ మైలురాయికి దగ్గరయ్యాడు. అక్షర్ మరో మూడు వికెట్లు తీస్తే.. 50 వికెట్ల క్లబ్ లో చేరతాడు.

రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 60 టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 47 వికెట్లు తీశాడు.

టీమిండియా పేసర్.. మహ్మద్‌ సిరాజ్‌ కూడా మరో 3 వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. సిరాజ్‌ ఇప్పటి వరకు 15 టెస్ట్‌ల్లో 46 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే భారత తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా ఉంది. జట్టు నిండా టాలెంటెడ్ ఆటగాళ్లు ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాల్లో అర్ధం కావడం లేదు.

సీనియర్లు కోహ్లి Virat Kohli రోహిత్‌, పుజారా, అశ్విన్‌, షమీ స్థానాలకు ఢోకా లేనప్పటికీ.. మిగతా 5 స్థానాలకే తీవ్ర పోటీ నెలకొని ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version