Site icon Prime9

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్.. రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌!

nikhat zareen

nikhat zareen

Nikhat Zareen: మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్ లో నిఖత్ జరీన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ లో భారత్‌ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ పసిడి పతకాన్ని కొల్లగొట్టింది.

రెండోసారి ప్రపంచ ఛాంపియన్.. (Nikhat Zareen)

మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్ లో నిఖత్ జరీన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ లో భారత్‌ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. దిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ స్వర్ణాల పంట పండిస్తోంది. ఈ పోటీల్లో ఇప్పటికే రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న భారత్.. మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.

50 కిలోల విభాగంలో నిఖత్‌ జరీన్‌ పసిడిని సొంతం చేసుకుంది. రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన గుయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది.

ఈ విజయంతో నిఖత్ జరీన్ రికార్డు సృష్టించింది. మేరీకోమ్ తర్వాత.. ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన బాక్సర్ గా నిలిచింది. గతేడాది 52 కేజీల విభాగంలో నిఖత్ పసిడి దక్కించుకుంది.
ఈసారి 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇక శనివారం భారత్.. రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

గతంలో నిఖత్‌ గెలిచిన టైటిల్స్ ఇవే..
2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2014 నేషన్స్‌ కప్‌లో స్వర్ణం

2015 జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం

2019 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజతం

2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి

2022 ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం

2023 ఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణం

 

Exit mobile version