GT vs MI: గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్.. 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది. గిల్ సూపర్ సెంచరీ సాధించాడు. 60 బంతుల్లో 129 పరుగులు చేశారు. ఇందులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఇక సాయి సుదర్శన్ కూడా రాణించాడు. 31 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివర్లో హర్దీక్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు.
ముంబయి బౌలర్లలో.. పియూష్ చావ్లా, మధ్వాల్ చెరో వికెట్ తీసుకున్నారు.