MI vs LSG: ముంబయి చివర్లో తడబడింది. మంచి ఆరంభం లభించిన దానిని చివరివరకు ఉపయోగించుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో గ్రీన్.. సూర్య కుమార్ రాణించారు. చివర్లో వధేరా రెండు సిక్సులు, రెండు ఫోర్లతో రాణించాడు. ఈ మ్యాచ్ లో రోహిత్, ఇషాన్ పూర్తిగా విఫలం అయ్యారు.
ఇక లక్న బౌలర్లలో నవీనుల్ హక్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. యష్ ఠాకుర్ 3, మోహ్సిన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.