Mumbai Bowler Vignesh Puthur instagram followers increased over night: ఐపీఎల్ 2025లో ముంబై జట్టు తరపున అరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్‌లోనే విఘ్నేష్ పుతూర్ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా.. ఈ మ్యాచ్‌లో చెన్నై కష్టతరంగా విజయం సాధించింది. అలవోకగా గెలుస్తుందని అనుకున్న తరుణంలో విఘ్నేష్ పుతూర్ ధాటికి చెన్నై బ్యాటర్లు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో అప్పటివరకు ఎవరికీ తెలియని విఘ్నేష్ పుతూర్.. ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టి తనపై పడేలా బౌలింగ్ చేశాడు.
అయితే, ముంబై, చెన్నై మ్యాచ్‌తో విఘ్నేష్ పుతూర్ ఓవర్ పైట్ స్టార్‌గా మారిపోయారు. ఎంతలా అంటే.. విఘ్నేష్ పుతూర్‌కు మొన్నటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 24.9వేల మంది ఫాలోవర్లు ఉండగా.. తాజాగా, వాటి సంఖ్య 3,28,000కి చేరింది. కొంతమంది ఏకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ కుమారుడు గ్రౌండ్‌లోనూ ఆటగాళ్లను వణికిస్తున్నాడని కొనియాడుతున్నారు.
ఇదిలా ఉండగా, కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల విఘ్నేష్ తండ్రి సునీల్ కుమార్ ఓ ఆటో డ్రైవర్. క్రికెట్‌పై విఘ్నేష్‌కు ఉన్న ఇష్టమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పలువురు క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక, విఘ్నేష్ కాలికట్ యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్ చేస్తూనే క్రీడారంగంలో స్పిన్నర్‌గా ఎదుగుతున్నాడు.
అంతకుముందు పేస్ బౌలింగ్ చేస్తుండగా.. తర్వాత స్పిన్నర్‌గా మారాడు. కేరళ క్రికెట్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. ఆ తర్వాత ముంబై ఫ్రాంఛైజీ విఘ్నేష్‌ను రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం స్టార్ బౌలర్లు, కోచ్‌ల సలహాలతో బౌలింగ్‌పై దృష్టి సారించాడు. కాగా, గతంలో ఎస్ఏ20 టోర్నీకి వెళ్లిన ఆయనకు మంచి అనుభవం దొరికింది. తర్వాత రషీద్ ఖాన్, లసిత్ మలింగ్ వంటి స్టార్ల సహకారంతో మరింత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు ఇటీవల చెప్పాడు.