Site icon Prime9

IPL 2025: రుతురాజ్ గైక్వాడ్ ఔట్.. చెన్నై కెప్టెన్‌గా మళ్లీ ధోనీనే..!

MS Dhoni back as CSK captain in IPL 2025

MS Dhoni back as CSK captain in IPL 2025

MS Dhoni back as CSK captain in IPL 2025: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని మరోసారి కెప్టెన్‌గా ప్రకటించింది. ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ తరుణంలో ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ అధికారికంగా ప్రకటించాడు.

 

ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. చెన్నై తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 11న చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. అంతకుముందు ధోనీ సారథ్యంలో చెన్నై 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. చివరిగా 2023లో చెన్నై కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించగా.. టైటిల్ గెలుచుకుంది. తాజాగా, తలైవా మళ్లీ కెప్టెన్‌గా రావడంతో చెన్నై భవితవ్యం మారుతుందని సీఎస్‌కే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

మరోవైపు, కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్.. మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్ల 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ చెన్నై గెలిచింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 44 బంతుల్లో 63 పరుగులు చేయగా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దీంతో ఈ సీజన్‌లో 150.62 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు.

Exit mobile version
Skip to toolbar