Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఈ పరుగుల మెషీన్ పేరు వినగానే అందరికి మెుదట గుర్తొచ్చేది అతడు ధరించే జెర్సీ నంబర్ 18. ఈ నంబర్ వెనక తనకున్న అనుబంధాన్ని విరాట్ బయటపెట్టాడు. దీంతో ఈ నంబర్ వెనక ఇన్ని విశేషాలు ఉన్నాయా అని ఇపుడు అందరూ చర్చించుకుంటున్నారు. అవేంటో ఓసారి మనమూ చూద్దాం..
ప్రత్యేకతలివే..(Virat Kohli)
విరాట్ కోహ్లీ.. ఈ పరుగుల మెషీన్ పేరు వినగానే అందరికి మెుదట గుర్తొచ్చేది అతడు ధరించే జెర్సీ నంబర్ 18. ఈ నంబర్ వెనక తనకున్న అనుబంధాన్ని విరాట్ బయటపెట్టాడు. దీంతో ఈ నంబర్ వెనక ఇన్ని విశేషాలు ఉన్నాయా అని ఇపుడు అందరూ చర్చించుకుంటున్నారు. అవేంటో ఓసారి మనమూ చూద్దాం..
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ శతకంతో చెలరేగాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ లో సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. అయితే విరాట్ శతకం చేసింది మే 18న. ఇది ఒక్కటే కాదు.. ఇలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి.
కోహ్లీ అండర్ 19 ఆడే సమయంలో.. 18 నంబర్ జెర్సీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే సంఖ్య కోహ్లీ జీవితంలో ప్రత్యేకంగా మారింది. కోహ్లీ క్రికెట్ లో ఆరంగ్రేటం చేసింది కూడా ఆగష్టు 18న.
కోహ్లీ రెండో ఐపీఎల్ సెంచరీ కూడా మే 18 నాడే. 2016లో పంజాబ్‌పై చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 113 పరుగులు చేశాడు. ఇదే విరాట్‌కు ఐపీఎల్‌లో అత్యుత్తమ స్కోరు.
విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి తొలి వన్డే ఆడింది 18 ఆగస్టు 2008లో.
పాకిస్థాన్ పై కూడా కోహ్లీ సెంచరీ చేసింది 18వ తేదీనే. ఇది 2012 మార్చి 18న ఢాకాలో జరిగిన మ్యాచ్ లో 183 పరుగులు చేశాడు.
కోహ్లీ టెస్టుల్లో రెండు శతకాలను ఇదే తేదీన బాదాడు. 18 ఆగస్టు 2018లో ఇంగ్లాండ్‌పై 103 పరుగులు చేయగా.. 2013 డిసెంబర్ 18న దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు.
విరాట్ 17 ఏళ్ల వయసులో ఉన్నపుడు డిసెంబర్ 18న ఆయన తండ్రి మరణించాడు.
విరాట్ తండ్రి ప్రేమ్ కూడా క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నంబరు 18నే వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా అదే నంబరుతో కన్పిస్తున్నాడు.
తాజాగా ఐపీఎల్‌లో ఆరో సెంచరీ నమోదు చేసింది కూడా ఆ తేదీనాడే.