Site icon Prime9

IPL 2025: తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ బోణీ.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ

RCB WON THE MATCH IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ ‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైటరైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్‌కతా నైటరైడర్స్ బ్యాటర్లలో రహానె(56), సునీల్ నరైన్(44), రఘువంశీ(30) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లు పడగొట్టగా.. హేజిల్ వుడ్ రెండు వికెట్లు, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, దయాల్ తలో వికెట్ తీశారు.

 

175 పరుగుల లక్ష్యఛేదనను బెంగళూరు కేవలం 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు సాల్ట్(56), విరాట్ కోహ్లీ(59) హాఫ్ సెంచరీలు చేయగా.. రజత్ పటీదార్(34) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన తలో వికెట్ తీశారు.

Exit mobile version
Skip to toolbar