Johnson Charles: 39 బంతుల్లో శతకం.. విధ్వంసం సృష్టించిన వెస్టిండీస్‌ క్రికెటర్‌

Johnson Charles: సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం.

Johnson Charles:సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం.

విధ్వంసం.. (Johnson Charles)

సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 10 ఫోర్లు.. 11 సిక్సులు ఉండటం విశేషం. వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఎప్పుడు అంచనా వేయలేం.. ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తారో.. ఎలా ఆడుతారో ఎవరికి తెలియదు. కానీ సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రిక బౌలర్లకు చుక్కలు చూపించాడు జాన్సన్ చార్లెస్.. కేవలం 39 బంతుల్లో సెంచరీ చేశాడు.

విండీస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో కింగ్‌ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్‌.. మొదటి బంతి నుంచే ప్రోటీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మెుత్తం మ్యాచులో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న ఈ కరీబియన్‌.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను పూర్తిచేశాడు. ఇక 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన చార్లెస్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

రికార్డులు ఇవే..

ఈ మ్యాచ్ లో కేవలం 39 బంతుల్లో సెంచరీ చేయడంతో ఓ రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్‌ క్రికెటర్‌గా చార్లెస్ నిలిచాడు.

అంతకుముందు ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. 2016లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గేల్‌ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఇక తాజా మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించిన చార్లెస్.. గేల్‌ రికార్డు బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన విండీస్‌ క్రికెటర్‌గా చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా క్రిస్‌ గేల్‌ పేరిటే ఉండేది.

2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్‌ 117 పరుగులు సాధించాడు.

ఇక ప్రపంచ క్రికెట్‌లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్‌ నిలిచాడు .అంతకుముందు ప్రోటీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.