Site icon Prime9

SRH Vs DC : ఢిల్లీపై విక్టరీ కొట్టిన సన్ రైజర్స్.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయం

SRH vs DC second match highlights in ipl 2023

SRH vs DC second match highlights in ipl 2023

SRH Vs DC : ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (63; 39 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స‌ర్లు), ఫిల్ సాల్ట్‌(59; 35 బంతుల్లో 9 ఫోర్లు) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించగా మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం అయ్యారు.

మ్యాచ్ ని గమనిస్తే లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ఢిల్లీకి స్పిన్నర్ మయాంక్  మార్కండే షాకిచ్చాడు. తొలుత అతడు వేసిన  12వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్..  అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే అభిషేక్ శర్మ.. మనీష్ పాండే  (1) ను పెవిలియన్ కు పంపాడు. అకీల్ హోసెన్ వేసిన 14వ ఓవర్లో ఢిల్లీకి మరో భారీ షాక్ తాకింది. మిచెల్ మార్ష్ భారీ షాట్ ఆడబోయి  మార్క్‌రమ్ చేతికి చిక్కాడు. మార్కండేనే వేసిన 16వ ఓవర్లో  ప్రియమ్ గార్గ్ (12).. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నటరాజన్ వేసిన  17వ ఓవర్లో  సర్ఫరాజ్ ఖాన్  (9)  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా  ఐదు వికెట్లు పడటంతో ఢిల్లీ ఒత్తిడికి లోనైంది. అయితే అక్షర్ పటేల్ (14 బంతుల్లో 29 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) క్రీజులో ఉండటంతో ఆ జట్టుకి విజయం అవకాశాలు ఇంకా ఉన్నాయి.

కానీ చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సి ఉండగా 19వ  ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. ఇక చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. ఇక సన్ రైజర్స్ విజయం ఖాయం అయ్యింది. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో మ‌యాంక్ మార్కండే రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్‌, అకేల్ హోసేన్, అభిషేక్ శ‌ర్మ ఒక్కొ వికెట్ తీశారు. దీంతో హైదరాబాద్ వరుస ఓటముల తర్వాత మళ్ళీ విజయాన్ని సాధించింది.

చెలరేగిన అభిషేక్ వర్మ, క్లాసెన్ (SRH Vs DC)..

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌కి ఆరంభంలోనే వరుసగా షాక్‌లు తగిలాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5), రాహుల్ త్రిపాఠి (10), కెప్టెన్ మర్‌క్రమ్ (8), హారీ బ్రూక్ (0) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. యంగ్ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ‌(67; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (53: 27 బంతుల్లో 2×4, 4×6) బాధ్యత తీసుకుని ఆఖరి వరకూ టీం ని నడిపించాడు. క్లాసెన్‌తో కలిసి స్లాగ్ ఓవర్లలో అబ్దుల్ సమద్ (28: 21 బంతుల్లో 1×4, 2×6), అకేల హుస్సేన్ (16 నాటౌట్: 10 బంతుల్లో 1×4, 1×6) హిట్టింగ్ చేశారు. దాంతో హైదరాబాద్ టీమ్ 197 పరుగుల మెరుగైన స్కోరుని నమోదు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కాగా ఈ సీజ‌న్‌లో హైద‌రాబాద్ జ‌ట్టుకు ఇది మూడో విజ‌యం. దాంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక నుంచి ఆడే ప్ర‌తి మ్యాచులో విజ‌యం సాధిస్తేనే స‌న్ రైజ‌ర్స్ ప్లే అవ‌కాశాలు ఉంటాయని తెలుస్తుంది.

Exit mobile version
Skip to toolbar