IPL 2025 27th Match- SRH Vs PKBS: హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 36 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. నేహల్ వధేరా 27 పరుగులు చేసి రాణించాడు. చివర్లలో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, ఏషన్ మలింగ 2 వికెట్లు తీశారు.