Site icon Prime9

LSG vs PBKS : ఊరకొట్టుడు కొట్టిన లక్నో బ్యాటర్లు.. భారీ టార్గెట్ చేధించలేక చేతులెత్తేసిన పంజాబ్

LSG vs PBKS match highlights in ipl 2023

LSG vs PBKS match highlights in ipl 2023

LSG vs PBKS : ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుంది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠను ఇస్తూ చివరి ఓవర్ వరకు సస్పెన్స్ , థ్రిల్లర్ మూవీస్ లా అనిపించేలా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో ముఖ్యంగా బ్యాట్స్ మెన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చెలరేగుతూ ఊరకొట్టుడు కొడుతున్నారు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ప్రతి మ్యాచ్ లోనూ భారీ టార్గెట్  లను ఇస్తున్నారు. ఇక శుక్రవారం నాడు మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఏం కొట్టుడు రా బాబు అనే రేంజ్ లో కొట్టారు. దీంతో లక్నో ఇచ్చిన 258 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్ 19.5 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల‌కు ఆలౌట్ అవ్వడంతో.. ల‌క్నో 56 ప‌రుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. సీజన్‌లో 8వ మ్యాచ్ ఆడిన లక్నోకి ఇది ఐదో విజయం కాగా.. పంజాబ్ కింగ్స్‌కి నాలుగో ఓటమి. ఈ నెల 15న లక్నోని 2 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించగా.. ఈ విజయంతో లక్నో సమానం చేసింది.

258 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్‌ లో.. కెప్టెన్ శిఖర్ ధావన్ (1), ప్రభసిమ్రాన్ సింగ్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైనా.. అనంతరం వచ్చిన అథర్వ (66: 36 బంతుల్లో 8×4, 2×6) అదరగొట్టాడు. ఇక అతనికి సికిందర్ రజా (36: 22 బంతుల్లో 4×4, 1×6) మంచి సపోర్ట్ ఇచ్చాడు. కానీ అప్పటికే టార్గెట్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఇద్దరూ ప్రతి బంతికీ హిట్టింగ్‌ చేసే ప్రయత్నంలో వికెట్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్ (23: 14 బంతుల్లో 2×4, 1×6) ఒక ఓవర్‌ లోనే అలా మెరిసి.. ఇలా ఔటయ్యాడు. చివర్లో శామ్ కరన్ (21: 11 బంతుల్లో 2×4, 1×6), జితేశ్ శర్మ (24: 10 బంతుల్లో 3×6) స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. కానీ కొద్ది సేపటి తర్వాత పెవిలియన్ బాట పట్టారు. ఇక మిగిలిన వారిలో షారూక్ ఖాన్ (6), రాహుల్ చాహర్ (0), కగిసో రబాడ (0) వరుస పెట్టి వికెట్లు ఇచ్చేయడంతో ఒక బంతి మిగిలి ఉండగానే పంజాబ్ 201 పరుగులకి ఆలౌటైంది. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశారు.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఊరకొట్టుడు కొట్టి ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. లక్నో బ్యాటర్లలో మార్క‌స్ స్టోయినిస్‌ (73; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కైల్ మేయ‌ర్స్‌(54; 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు మాస్ హిట్టయింగ్ కి.. నికోల‌స్ పూర‌న్‌ (45; 18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆయుష్ బ‌దోని (43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) విధ్వంసం తోడవ్వడంతో భారీ స్కోర్ సాధించారు. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఈ నలుగురు మాత్రం పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ రెండు వికెట్లు తీయ‌గా, అర్ష్ దీప్ సింగ్, సామ్ క‌ర‌న్‌, లివింగ్ స్టోన్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. పంజాబ్ పై విజ‌యం సాధించ‌డంతో ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో రెండో స్థానానికి చేరింది. ఇక 2013లో పుణె వారియర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 263 పరుగులు ఐపీఎల్ లో టాప్ స్కోర్ గా కొనసాగుతుంది.

 

Exit mobile version