IPL 2023 SRH vs RR: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్-2023 సీజన్ లో నాలుగో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ ఫుల్ డామినేంగ్ ప్రదర్శించింది. హోమ్ గ్రౌండ్లో తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ టీం ఘోర పరాభవం చవిచూసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 72 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ విఫలమయ్యిందనే చెప్పాలి. నిర్ణీత ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది.
IPL 2023 SRH vs RR: హోం గ్రౌండ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్

IPL 2023 srh vs rr