Site icon Prime9

IPL 2023 RCB vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

IPL 2023 MI vs RCB

IPL 2023 MI vs RCB

IPL 2023 RCB vs MI: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్డేడియం వేదికగా 5 సార్లు ఐపీఎల్ విజేతగా ఉన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. విరాట్ వర్సెస్ రోహిత్ సేనల పోరులో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

ఐపీఎల్ కెరీర్లో ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఇప్పటి వరకూ 30 మ్యాచ్‌లు జరిగాయి. కాగా ఇందులో ఆర్సీబీ 13 సార్లు, ముంబై 17 సార్లు విజయం సాధించాయి. అయితే గత 5 మ్యాచుల్లో చూస్తే ముంబై ఇండియన్స్ అంతగా ప్రదర్శనను కనపర్చలేకపోయింది. ఒక్క మ్యాచ్ లో కూడా గెలుపొందలేదు.

అందులోనూ బెంగళూరు పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడంతో ఎవరు ఈ పిచ్‌పై భారీ స్కోర్ చేస్తారా అనే యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మొహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, దినేష్ కార్తీక్, షాహ్‌బాజ్ అహ్మద్, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, ఆకాష్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ ఎలన్, సురేష్ ప్రభుదేశాయ్, కర్ణ శర్మ, సిద్ధార్ద్ కాల్, డేవిడ్ విల్లీ, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, మనోజ్ భాండగే, రాజన్ కుమార్, అవినాష్ సింహ్,సోను యాదవ్, మైకేల్ బ్రేస్‌వెల్

ముంబై ఇండియన్స్ టీమ్
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డ్వాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ, జోఫ్రా ఆర్చర్, టీమ్ డేవిడ్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, రమణ్ దీప్ సింహ్, రుతిక్ షౌకీన్, అర్జున్ టెండూల్కర్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కార్తికేయ, జేసన్ బెహెరెన్డార్ఫ్, ఆకాష్ మధవాల్, క్యామెరూన్ గ్రీన్, రిచర్డ్ సన్, పీయూష్ చావ్లా, డ్యూవాన్ జాన్సన్, విష్ణు వినోద్, శామ్స్ ములానీ, నేహల్ వడేరా, రాఘవ్ గోయల్

 

Exit mobile version
Skip to toolbar