Site icon Prime9

IPL Final: చెన్నై పాంచ్‌ పటాకానా..? గుజరాత్‌ రెండోసారా?.. కప్ కొట్టేదెవరు?

csk vs gt

csk vs gt

IPL Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే.. చివరి మ్యాచ్ ఆడుతున్నాయి. ఇక ఐదోసారి చెన్నై కప్ గెలుస్తుందా.. లేదా గుజరాత్ రెండోసారి ట్రోఫిని ముద్దాడుతుందా అనే వేచి చూడాలి.

ఎవరిదీ పై చేయి..(IPL Final)

ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే.. చివరి మ్యాచ్ ఆడుతున్నాయి. ఇక ఐదోసారి చెన్నై కప్ గెలుస్తుందా.. లేదా గుజరాత్ రెండోసారి ట్రోఫిని ముద్దాడుతుందా అనే వేచి చూడాలి.

రెండు నెలలుగా అలరించిన ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. కప్ ను గెలిచేందుకు దిగ్గజ జట్లైన చెన్నై, గుజరాత్‌లు సిద్ధమయ్యాయి. ఐదోసారి కప్‌ గెలిచి ధోనీ సేన ముంబయి రికార్డును సమం చేస్తుందా..? లేదా వరుసగా రెండోసారి కప్‌ గెలిచి హార్దిక్‌ సేన తన సత్తా చాటుతుందా? అనేది వేచి చూడాలి. ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.

చెన్నై జట్టు ఎలా ఉందంటే..

గత సీజన్ లో చెన్నై పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈసారి మాత్రం అనుహ్యంగా పుంజుకుని.. ఫైనల్లో అడుగుపెట్టింది. ధోని తనదైన వ్యూహాలతో జట్టును విజయపథంలో నడిపించాడు. లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు తొలి క్వాలిఫయర్‌లోనే డిఫెండింగ్‌ చాంఫియన్‌ గుజరాత్‌ను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన ఆ జట్టు.. ఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఓపెనర్లు బలం..

ఈ సీజన్ లో చెన్నై ఓపెనర్లే ప్రధాన బలం. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మంచి భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఇక మిడిలార్డర్ కూడా క్లిష్ట సమయంలో రాణిస్తుంది. శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, రహానెలతో మిడిల్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఇక ఫినిషర్‌గా ధోనీ సత్తా చాటేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఇక యువ బౌలర్లను ధోని.. బాగా ఉపయోగించుకుంటున్నాడు. తుషార్‌ దేశ్‌పాండే, పతిరణ, దీపక్‌ చాహర్‌, తీక్షణ సత్తా చాటుతున్నారు.

గుజరాత్ బలాలు ఇవే..

ఈ సీజన్ ప్రారంభం నుంచి గుజరాత్ సత్తా చాటుతూ వచ్చింది. క్వాలిఫయర్ లో చెన్నైపై ఓడినప్పటికి తిరిగి ఫైనల్ కు చేరుకుంది.

సునాయాసంగా శతకాలు బాదేస్తూ, రికార్డులను చెరిపేస్తూ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న గిల్‌.. మరోసారి రాణిస్తే ఫైనల్లో ఆ జట్టుకు తిరుగుండదు.

సాహా, సాయి సుదర్శన్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు.

ఇక బౌలింగ్ లో చెన్నై కంటే గుజరాత్ బలంగా కనిపిస్తోంది. షమీ , రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ బౌలింగ్ లో రాణిస్తున్నారు.

ఎవరిది ఆధిక్యం..

ఈ సీజన్‌ క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో తప్పితే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు తలపడిన అన్ని మ్యాచ్‌ల్లో గుజరాత్‌దే విజయం.

అయితే ప్లేఆఫ్స్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడం ద్వారా ధోనీ సేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.

అదే దూకుడును ఫైనల్లో కొనసాగిస్తుందా..? లేదా గుజరాత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఈ రెండు జట్ల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఫైనల్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన జట్టుగా గుజరాత్ ఇప్పటికే రికార్డు సృష్టించింది.

Exit mobile version