Site icon Prime9

IPL 2023: ఐపీఎల్‌ 2023 షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్ లో ఏడు మ్యాచులు

ipl schedule

ipl schedule

IPL 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యూస్ రానే వచ్చింది. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.
లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. (IPL 2023)

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు పండగ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 షెడ్యూల్ రానే వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. కరోనా ప్రభావంతో.. గతేడాది కేవలం ముంబయి, పుణె, అహ్మదాబాద్‌లో స్టేడియాల్లో మాత్రమే లీగ్ నిర్వహించారు. కానీ ఈ సారి ప్రతి హోమ్ టీమ్.. సొంత మైదానంలో మ్యాచులు జరగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ సారి అహ్మదాబాద్ వేదికగా.. గుజరాత్ టైటాన్స్‌ తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఏప్రిల్ 1న మొహాలీలో పంజాబ్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

హైదరాబాద్ లో ఏడు మ్యాచులు..

కరోనా ప్రభావంతో.. మూడేళ్ల పాటు హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా ఉండటంతో.. సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈసారి హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా.. ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక్కడ జరిగే మెుదటి మ్యాచ్ లో సన్ రైజర్స్.. రాజస్థాన్ తో తలపడనుంది. రెండో మ్యాచ్ లో పంజాబ్ తో సన్ రైజర్స్ పోటి పడనుంది.

ఈ ఏడాది రాజస్తాన్, పంజాబ్ జట్లు రెండు వేదికల్లో ఆడనున్నాయి. సొంత మైదానంలో జరిగే ఏడు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్ని గుహవతి వేదికగా ఆడనుంది రాజస్తాన్. ఆపై మిగిలిన ఐదు మ్యాచ్‌ల్ని జైపూర్‌లో ఆడుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ మొదటి ఐదు మ్యాచ్‌ల్ని మొహాలీలో చివరి రెండు మ్యాచ్‌ల్ని ధర్మశాలలో ఆడబోతుంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికల్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది.

ఈ సీజన్‌లో భాగంగా మొత్తం 12 వేదికల్లో 70 లీగ్ మ్యాచ్‌లు 52 రోజుల పాటు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. మొత్తం 10 టీమ్స్ తన సొంత మైదానంలో ఏడు మ్యా్‌చ్‌లు, ప్రత్యర్థి మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడతాయి.

Exit mobile version