Site icon Prime9

IPL 2023 Rule: ఐపీఎల్ లో ఆ రూల్ మార్చిన బీసీసీఐ

IPL 2023 Rule

IPL 2023 Rule

IPL 2023 Rule: ఇండియన్ ప్రీమియర్ లీగ్… ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న టీ20 లీగ్. అలాంటి ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. గత ఏడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరుతో 2023 ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది.

 

ప్రత్యర్థి జట్టు కెఫ్టెన్ అనుమతి లేకుండా(IPL 2023 Rule)

కాగా ఐపీఎల్ లో కొత్త నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. సాధారణంగా ఇప్పటివరకు జట్ల కెఫ్టెన్లు టాస్ వేయడానికి ముందే తుది జట్టు వివరాలను ప్రకటించాల్సి ఉండేది. అయితే ఈ నిబంధనల్లో మార్పులు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇకపై కెఫ్టెన్లు టాస్ పడ్డాక తుది జట్లను ప్రకటించవచ్చు. ‘ రెండు జట్ల కెఫ్టెన్లు.. 11 మందితో కూడిన తుది జట్టు, 5 గురు సబ్ స్టిట్యూట్ ల వివరాలను టాస్ వేసిన తర్వాత లిఖిత పూర్వకంగా రెఫరీకి అందించవచ్చు. ముందు తుది జట్టును వెల్లడించినా.. ప్రత్యర్థి జట్టు కెఫ్టెన్ అనుమతి లేకుండా ఛేంజెస్ చేసుకోవచ్చు.’అని బీసీసీఐ తెలిపింది. ఈ నిబంధనల ఆధారంగా తుది జట్టును ఎంచుకునే అవకాశం లభించింది.

 

 

10 జట్లు పాల్గొనే ఐపీఎల్ 2023 సీజన్‌లో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 7 మ్యాచ్‌లను సొంత మైదానం, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌ – Aలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి. గ్రూప్‌ – Bలో చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ఉన్నాయి. మొత్తం మ్యాచుల కోసం 12 వేదికలను ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. అహ్మదాబాద్‌, మొహాలి, లఖ్‌నవూ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, జయ్‌పుర్, ముంబై, గౌహతి, ధర్మశాల వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు.. మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తారు.

 

 

Exit mobile version