IPL 2023 Rishabh Pant: ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో పంత్ సందడి

మంగళవారం హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చాడు.

IPL 2023 Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెఫ్టెన్ రిషబ్ పంత్ గత ఏడాది లో డిసెంబర్ లో రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడిన తెలిసిందే. నాలుగు నెలల నుంచి చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో పంత్ ఈ ఏడాది పలు మేజర్ సిరీస్ లతో పాటు ఐపీఎల్ కు దూరమైన విషయం తెలిసిందే. పంత్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యహరిస్తున్నాడు.

గ్యాలరీ నుంచి ఎంకరేజ్

మంగళవారం హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చాడు. బీసీసీఐ గ్యాలరీలో కూర్చుని ఢిల్లీ ఆటగాళ్లను ఎంకరేజ్ చేశాడు. ఇంకా పూర్తిగా కోలుకోని రిషబ్ చేతి కర్ర సాయంతో నడుస్తున్నాడు. ఢిల్లీ తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీ ని డగౌట్ లో వేలాడదీశారు. అయితే దీనిపై బీసీసీఐ సీరియస్ అయింది. భవిష్యత్ ఇలాంటి చర్యలు చేయవద్దని ఢిల్లీకి వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

 

 

గుజరాత్ రెండో విజయం.. పట్టిక లో టాప్(IPL 2023 Rishabh Pant)

మరో వైపు గుజరాత్ తో జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ బోల్తాపడింది. దీంతో గుజరాత్ రెండో విజయంతో ఐపీఎల్ సీజన్ 16 పాయింట్ల టేబుల్ లో టాప్ లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. టైటాన్స్ బౌలర్లు షమీ, రషీద్, జోసెఫ్ చెలరేగి 162 పరుగులతో ఢిల్లీని కట్టడి చేశారు. ఆ తర్వాత ఛేదనలో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్ తో గుజరాత్ ఖాతాలో రెండో విజయం నమోదు అయింది.

గుజరాత్ తొలి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సాయి సుదర్శన్.. రెండో మ్యాచ్ తో తుది జట్టులో చోటు సంపాదించాడు. 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో 62 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. సుదర్శన్ కు తోడుగా మిల్లర్ మెరవడంతో గుజరాత్ కు విజయం ఖాయం అయింది. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభం అయినా.. వెంటనే వెంటనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాహా(14), గిల్(14) తో పాటు కెప్టెన్ హార్ధిక్ పాండ్య (5)తో పెవిలియన్ చేరారు. ఆ సమయంలో క్రీజులో సుదర్శన్, విజయ్ శంకర్ నిలదొక్కుకుని ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. అనంతరం విజయ్ శంకర్ కూడా ఔట్ అవ్వడం మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి 5 ఓవర్లలో 46 పరుగుల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అపుడే క్రీజులోకి వచ్చిన మిల్లర్.. ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుసగా రెండు సిక్స్ లు, ఫోర్లతో చెలరేగి 16 ఓవర్లలో 20 పరుగులు చేశాడు. తర్వాత సుదర్శన్ కూడా మరో 14 పరుగుల చేసి గుజరాత్ ను విజయతీరాలకు చేర్చారు.