IPL 2023 RCB vs CSK: ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సీఎస్కే తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తమ జట్టులో ఒకే ఒక మార్పుతో బరి లోకి దిగుతోంది. గాయపడిన మగాల స్థానంలో శ్రీలంక యంగ్ పేసర్ మతీషా పతిరణ ఇచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని( కెఫ్టెన్) , మతీష్ పతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే,
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, వైషాక్ విజయ్‌కుమార్
🚨 Toss Update from M. Chinnaswamy Stadium 🏟️@faf1307 has won the toss & @RCBTweets have elected to bowl against the @msdhoni-led @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/QZwZlNju3V #TATAIPL | #RCBvCSK pic.twitter.com/rHKuDWsRuG
— IndianPremierLeague (@IPL) April 17, 2023
కాగా, ఐపీఎల్ 16 లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై, ఆర్సీబీ లు 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు లక్నో, గుజరాత్, పంజాబ్ జట్లతో సమానంగా 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రెండు రోజుల క్రితం ఢిల్లీపై బెంగళూరు అద్భుత విజయం సాధించి ఊపు మీద ఉంది. మరోసారి తన సొంత గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పోరుకు సిద్ధమైంది. మరోవైపు గత మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన సీఎస్కే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. చివరి ఓవర్‌లో ధోనీ, జడేజా ఉన్న.. చెన్నై ఓటమిపాలైంది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం కీలకం కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. టాప్ ఆర్డర్ రాణిస్తున్నా.. మిడిల్‌లో సరిగా ఆడకపోవడంతో చివర్లో వచ్చే బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. అయితే బెంగళూరు బౌలర్లను ఎదుక్కోవాలంటే టాప్ ప్లేయర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలి. రాత్రి 7.30 గంటలకు ఆర్‌సీబీ , సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.