IPL 2023 LSG vs DC: ఐపీఎల్ సీజన్ 16 శనివారం డబుల్ హెడర్ లో భాగంగా మరో కీలక పోరు జరుగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సీజన్ లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ బరిలోకి దిగారు. ఢిల్లీ బౌలర్స్ పటిష్టంగా బౌలింగ్ చేస్తుండగా.. లక్నో జెయింట్స్ ఆచితూచి ఆడుతోంది. ఈ క్రమంలో నాలుగో ఓవర్ చివరి బంతికి రాహుల్ (8).. సర్కారియా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి అక్షర్ పటేల్ లు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రైట్ హ్యండ్ బ్యాటర్ దీపర్ హుడా క్రీజులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ రూపంలో భారీ వికెట్ కోల్పోవడంతో లక్నో బ్యాటర్స్ మేయర్, దీపక్ హుడా ఆచి తూచి ఆడుతున్నారు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 1 వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. మేయర్స్ (42), దీపక్ హుడా(9) వద్ద ఆడుతున్నారు.
11 ఓవర్ లో చివరి బంతికి లక్నో రెండో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా (17) కు పెవిలియన్ చేరాడు. అనంతనం మేయర్స్ దూకుడు పెంచాడు. 38 బంతుల్లో 73 పరుగులు చేసిన మేయర్స్ 12 ఓవర్ లో మూడో బంతికి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం లక్నో నాలుగు వికెట్ల నష్ట పోయింది. క్రీజులో నికోలస్ పూరన్(10), కృనాల్ పాండ్య(5) లు ఉన్నారు. 15 ఓవర్లకు లక్నో స్కోరు 127/4 గా ఉంది.
𝗨𝗻𝗽𝗹𝗮𝘆𝗮𝗯𝗹𝗲!
Only a special delivery like this one could have got Kyle Mayers out today 🤯
Follow the match ▶️ https://t.co/086EqX92dA #TATAIPL#TATAIPL | #LSGvDC pic.twitter.com/ka9JIO2KD1
— IndianPremierLeague (@IPL) April 1, 2023
ట్రోపీపై కన్నేసిన ఇరు జట్లు(IPL 2023 LSG vs DC)
గత ఏడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్ ను దూరమమ్యాడు. దీంతో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు కేఎల్ రాహుల్ సారధ్యంలో గత సీజన్ లో ప్లేఆఫ్స్ వరకు చేరిన లక్నో సూపర్ జెయింట్స్.. ఈ సీజన్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.
కాగా, అంతకుముందు టాస్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ త్వరగా కోలుకోవాలన్నాడు. ఈ ఐపీఎల్ లో కొత్తగా తీసుకొచ్చన ఇంఫాక్ట్ ప్లేయర్ రూల్ పై తనకు కొంతమేర గందర గోళం ఉన్నట్టు తెలిపాడు. మరో వైపు గత సీజన్ లో 5 స్థానంలో నిలిచిన ఢిల్లీ ఈసారి ట్రోఫీ పై కన్నేసింది.
జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రోవ్‌మన్ పావెల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
లక్నో సూపర్ జెయింట్స్ : KL రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్